Rohit And Kohli Leave Early For WC: IPL మధ్యలోనే రోహిత్, విరాట్ సహా భారత ఆటగాళ్లు అమెరికాకు.. కారణం ఇదే!

IPL మధ్యలోనే రోహిత్, విరాట్ సహా భారత ఆటగాళ్లు అమెరికాకు.. కారణం ఇదే!

ఐపీఎల్-2024 మధ్యలో నుంచే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా టీమిండియా ప్లేయర్లు అమెరికాకు వెళ్లిపోనున్నారు. దీనికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2024 మధ్యలో నుంచే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా టీమిండియా ప్లేయర్లు అమెరికాకు వెళ్లిపోనున్నారు. దీనికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

క్రికెట్ ఫ్యాన్స్​కు ఐపీఎల్-2024 మస్తు వినోదాన్ని అందిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్​లోని ఒక్కో మ్యాచ్​ ఉత్కంఠభరితంగా సాగుతూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నాయి. ఈ సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్​లు ఒకెత్తు అనుకుంటే.. సెకండాఫ్ దాన్ని మించి జరుగుతోంది. 200 ప్లస్ స్కోర్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. 250 ప్లస్ స్కోరు కొట్టినా సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. పరుగుల వర్షం కురుస్తుండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో మూడు వారాల పాటు ఐపీఎల్​ మాయలోనే ఉండనున్నారు ఫ్యాన్స్. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్-2024 స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు వరల్డ్ కప్​ కోసం యూఎస్​కు వెళ్లాల్సి ఉంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం ముందే అక్కడికి పయనం కానున్నారని తెలుస్తోంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ మధ్యలోనే యూఎస్​కు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీళ్లతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రా కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కే లిస్ట్​లో ఉండటం పక్కా అని చెబుతున్నారు. స్టార్ ఆటగాళ్లు వెళ్లిపోతే ఐపీఎల్ పరిస్థితి ఏంటి? అయినా ఇలా మధ్యలో ఎందుకు వెళ్లిపోతున్నారనే కదా మీ డౌట్. దాదాపుగా సగం భారత జట్టు ముందే వరల్డ్ కప్​కు పయనమవడం వెనుక ఓ రీజన్ ఉంది. టీ20 ప్రపంచ కప్ జూన్ 1వ తేదీన స్టార్ట్ అవుతంది. మెగా టోర్నీకి ముందు అన్ని టీమ్స్ పూర్తి స్క్వాడ్స్​తో రెండు వార్మప్ మ్యాచులు ఆడతాయి. అందుకే ఐపీఎల్ ప్లేఆఫ్స్ టైమ్​లోనే ఫస్ట్ బ్యాచ్ భారత ఆటగాళ్లు యూఎస్ వెళ్లనున్నారు.

ప్లేఆఫ్స్​కు క్వాలిఫై కాని జట్లలోని టీమిండియా ప్లేయర్లు ముందే అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు. నాకౌట్స్‌లో ఆడే క్రికెటర్లు మే 27 లేదా 28వ తేదీన అమెరికాకు బయలుదేరే అవకాశం ఉంది. ప్లేఆఫ్స్​కు ముందే వెళ్లే బృందంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, సిరాజ్, హార్దిక్, స్కై ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఐపీఎల్​లో వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చేశాయి. టెక్నికల్​గా చెప్పాలంటే ఆ టీమ్స్ పనైపోయింది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ప్లేఆఫ్స్​కు వెళ్లడం అసాధ్యమే. కాబట్టి ఐపీఎల్ మధ్యలోనే విరాట్, రోహిత్ సహా దాదాపుగా సగం టీమిండియా ప్లేయర్లు యూఎస్​కు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఐపీఎల్ ప్లేఆఫ్స్ మే 21న మొదలవనుంది.

Show comments