T20 World Cup Hardik Pandya Key Yuvraj Singh: ఈ వరల్డ్ కప్​లో అతడే భారత్​ను గెలిపిస్తాడు.. యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఈ వరల్డ్ కప్​లో అతడే భారత్​ను గెలిపిస్తాడు.. యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

గతేడాది తృటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో లెజెండ్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గతేడాది తృటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో లెజెండ్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గతేడాది తృటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచి దాదాపు 11 ఏళ్లు కావొస్తోంది. దీంతో కప్పు కోసం అభిమానుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. గత కొన్నేళ్లలో నాకౌట్ దాకా వెళ్లడం ఓడిపోయి రావడం భారత్​కు అలవాటుగా మారింది. గతేడాది ఫైనల్స్​కు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్​​లోనూ అదే టీమ్ వల్ల టైటిల్ మిస్సయింది. అయితే ఈసారి ఎలాంటి తప్పుకు ఛాన్స్ ఇవ్వొద్దని రోహిత్ సేన కోరుకుంటోంది. యూఎస్​ఏ-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న పొట్టి కప్పును ఎలాగైనా ఎగరేసుకుపోవాలని భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్​లో ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకోవడంపై పలు విమర్శలు వచ్చాయి. ఐపీఎల్​-2024లో అతడు విఫలమవడం, ఇంజ్యురీ నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీమ్​లోకి తీసుకొని తప్పు చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు లెజెండ్ యువరాజ్ సింగ్. టీ20 వరల్డ్ కప్​లో రోహిత్, కోహ్లీ కాదు.. భారత్​ను గెలిపించేది హార్దికేనని స్పష్టం చేశాడు. పాండ్యా ఓ మ్యాచ్ విన్నర్ అని.. అతడ్ని తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. గతంలో టీమిండియాకు అతడు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడని, అతడి సామర్థ్యాన్ని శంకించడం కరెక్ట్‌ కాదన్నాడు యువీ.

‘ఓ ప్లేయర్​ను టీమ్​లోకి తీసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎలా ఆడారనేది సెలెక్టర్లు చూస్తారు. ఆ తర్వాత ఐపీఎల్ పెర్ఫార్మెన్స్​ను పరిగణనలోకి తీసుకొని ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. హార్దిక్ ఐపీఎల్​లో సరిగ్గా ఆడలేదు. కానీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అతడు భారత జట్టుకు అపూర్వమైన సేవలు అందించాడు. అందుకే అతడు వరల్డ్ కప్ స్క్వాడ్​లో ఉన్నాడు. మన జట్టులో హార్దిక్ ఎంతో ఇంపార్టెంట్ ప్లేయర్. పొట్టి కప్పులో పాండ్యా ఎలా బౌలింగ్ చేస్తాడనేది చాలా కీలకం. అలాగే అతడి ఫిట్​నెస్​ మీద కూడా అందరి దృష్టి నెలకొంది. ప్రపంచ కప్​లో అతడు స్పెషల్​గా ఏదో చేస్తాడని నేను భావిస్తున్నా. ఏదో మ్యాజిక్ చేసి టీమిండియాను గెలిపిస్తాడని నమ్ముతున్నా’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. మరి.. యువీ చెప్పినట్లు పాండ్యా భారత్​ను గెలిపిస్తాడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments