ప్లే ఆఫ్స్‌ రేస్‌లోకి దూసుకొచ్చిన RCB.. మారిన లెక్కలు!

ప్లే ఆఫ్స్‌ రేస్‌లోకి దూసుకొచ్చిన RCB.. మారిన లెక్కలు!

RCB, Playoffs, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంజాబ్‌పై ఘన విజయంతో ఆర్సీబీ కూడా రేసులోకి వచ్చేసింది. రసవత్తరంగా మారిన పాయింట్ల పట్టికలో ఏ టీమ్‌ ముందుకు వెళ్తోందో చెప్పడం కష్టంగా మారింది. ప్లే ఆఫ్స్‌ వెళ్లే ఛాన్స్‌ ఉన్న నాలుగు టీమ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.. ​

RCB, Playoffs, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంజాబ్‌పై ఘన విజయంతో ఆర్సీబీ కూడా రేసులోకి వచ్చేసింది. రసవత్తరంగా మారిన పాయింట్ల పట్టికలో ఏ టీమ్‌ ముందుకు వెళ్తోందో చెప్పడం కష్టంగా మారింది. ప్లే ఆఫ్స్‌ వెళ్లే ఛాన్స్‌ ఉన్న నాలుగు టీమ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.. ​

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌ను 60 పరుగుల తేడాతో చిత్తు చేస్తూ.. విజయభేరి మోగించింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో చేతులెత్తేసిన పంజాబ్‌ కింగ్స్‌.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పంజాబ్‌ కూడా ఈ సీజన్‌లో ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌తో పాయింట్ల పట్టికల మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే రెండు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్నా.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌ ఏవో ఇంకా ఒక క్లారిటీ రాని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్క టీమ్‌ కూడా ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా చేరుకోలేదు. కానీ, పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయంతో నిన్నటి వరకు ఉ‍న్న లెక్కలు కాస్త మారియి. మరి ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉన్న నాలుగు టీమ్స్‌ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

పాయింట్ల పట్టికను ఒక సారి పరిశీలిస్తే.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి.. నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉంది. రెండో స్థానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి ఉంది. ఈ రెండు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరడం లాంఛనమే. ఎందుకంటే.. ఈ రెండు టీమ్స్‌కు ఇంకా మూడేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌ గెలిచినా.. అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయి. ఇప్పుడు మిగిలిన రెండు స్థానాల కోసమే అసలు పోటీ. ఆ రెండు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్సీబీ టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నాయి. ఈ ఐదు టీమ్స్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌ 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా.. ఏదో ఒక ప్లేస్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మెరుగైన రన్‌ రేట్ కూడా ఉంది. ఇప్పుడు మిగిలిన ఒక్క స్థానం కోసం నాలుగు టీమ్స్‌ మధ్య భీకర పోటీ నెలకొంది. వాటిలో సీఎస్‌కే.. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి.. ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా.. నెట్‌ రన్‌రేట్‌పై ఆధారపడాలి. లక్నో కూడా అంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. నెట్‌ రేట్‌పై ఆధారపడాలి.

ఇక ఆర్సీబీ.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి. ఒక్క మ్యాచ్‌ ఓడినా.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడాలి. టాప్‌ 3లో ఉన్న కేకేఆర్‌, రాజస్థాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌.. తమ మిగిలి ఉన్న అన్ని మ్యాచ్‌లు గెలిచి, ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ఆర్సీబీ నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మరి ఈ లెక్కలన్ని మరో రెండు, మూడు రోజుల్లో తేలిపోనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న జట్లు.. వారి మిగిలి ఉన్న మ్యాచ్‌లు, ప్రత్యర్థి జట్లు, వారి ప్రదర్శన అన్ని విశ్లేషించి చూస్తే.. కేకేఆర్‌, రాజస్థాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే.. ఈ నాలుగు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉంది. మరి ఏ నాలుగు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments