Eagle Movie Twitter Review: ఈగల్‌ ట్విట్టర్‌ రివ్యూ.. రవితేజ యాక్షన్‌ డ్రామా ఎలా ఉందంటే

ఈగల్‌ ట్విట్టర్‌ రివ్యూ.. రవితేజ యాక్షన్‌ డ్రామా ఎలా ఉందంటే

Eagle Twitter Review: రవితేజ నటించిన ఈగల్‌ సినిమా నేడు విడుదలయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉందో అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. మీకోసం ఆ ట్విట్టర్‌ రివ్యూ..

Eagle Twitter Review: రవితేజ నటించిన ఈగల్‌ సినిమా నేడు విడుదలయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉందో అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. మీకోసం ఆ ట్విట్టర్‌ రివ్యూ..

మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమా నేడు అనగా ఫిబ్రవరి 9, శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా.. అప్పుడు తప్పుకుని.. నేడు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రీమియర్‌ షో చూసిన అభిమానులు.. ఈగల్‌ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటున్నారు. చాలా వరకు సినిమా బాగుంది అనే అంటున్నారు. ఈగల్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అని.. రవితేజ ఖాతాలో మరో సూపర్‌ హిట్‌ పక్కా అని కామెంట్స్‌ చేస్తున్నారు అభిమానులు. డైరెక్టర్‌లో చాలా టాలెంట్‌ ఉందని.. అది తెరపై ప్రత్యక్షం అయ్యింది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఈగల్ రెండో పార్ట్ యుద్దకాండ అని కూడా ఉందట. అంటే ఈగల్ సీక్వెల్ కూడా రెడీగానే ఉందని తెలుస్తోంది.

సినిమాలో చాలా మాస్‌ సీన్లు ఉన్నాయని.. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఈసీన్లు చాలా రోజుల పాటు మన మైండ్‌లో నిలిచిపోతాయని.. ఈగల్‌ యాక్షన్‌ డ్రామా.. ఫుల్‌ స్టైలీష్‌గా ఉంది అంటున్నారు అభిమానులు. అలానే రవితేజ బెస్ట్ మేకోవర్.. టాప్ నాచ్ విజువల్స్.. ఈగల్‌ని కచ్చితంగా చూడాల్సిందే అని పోస్ట్‌ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ కన్నా సెకండాఫ్‌ ఆసక్తికరంగా ఉందని.. క్లైమాక్స్‌, ప్రీక్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ అదిరిపోయాయని కొందరు రాసుకొచ్చారు. ఇక డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేనికి గన్స్ మీదున్న నాలెడ్జ్‌ సూపర్బ్‌ అని.. ఈగల్‌ ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉందని.. చాప్టర్లు, చాప్టర్లుగా కథ చెప్పిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే సినిమాలో సెంటిమెంట్‌ పెద్దగా వర్కౌట్‌ కాలేదని కొందరు పోస్ట్‌ చేశారు.

ఇక ఈగల్‌కి డైలాగ్స్‌ ప్రాణమని..  మాస్‌ మహారాజా రవితేజ మరోసారి బిగ్‌ స్క్రీన్‌ మీద యాక్షన్‌ సన్నివేశాల్లో విజృంభించాడని కొందరు పోస్ట్‌ చేస్తున్నారు. అలానే అనుపమ కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంటున్నారు. సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి పాత్రలు దక్కాయని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. అయితే కొంత మందికి మాత్రం ఈగల్‌ పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. తమ ట్విట్టర్‌ రివ్యూలో వరస్ట్ అని చెప్పేస్తున్నారు. అసలు ఈగల్‌ ఎలా ఉందో తెలియాలంటే పూర్తి రివ్యూ రావాల్సిందే అంటున్నారు అభిమానులు.

Show comments