Rashmika Mandanna: ఒక్క మాటతో విజయ్ తనకి ఎంత ముఖ్యమో చెప్పిన రశ్మిక!

Rashmika Mandanna: ఒక్క మాటతో విజయ్ తనకి ఎంత ముఖ్యమో చెప్పిన రశ్మిక!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ "రష్మిక మందన్న". అయితే, కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ "రష్మిక మందన్న". అయితే, కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన “యానిమల్” చిత్రానికి.. ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. ఇందులో రణ్ బీర్ కపూర్, బాబీ డియోల్ తో పాటు రష్మిక కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. అప్పటివరకు టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక.. పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇక ఇప్పుడు “యానిమల్” చిత్రంలో తనదైన నటనతో అందరిని ఆకట్టుకుని.. అటు నార్త్ ఆడియన్సు నుంచి కూడా పోజిటవ్ టాక్ సంపాదించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీక తన తోటి నటులైన రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ముఖ్యంగా అమితాబ్ సర్ చాలా సరదాగా ఉంటారని.. షూటింగ్ సమయంలో ఆయనకు ఎవరైనా కనిపిస్తే వయసులో వ్యత్యాసం చూపించకుండా .. అందరిని ఒకేలా గౌరవిస్తారని తెలిపింది. అలాగే రణ్ బీర్ కపూర్ చాలా స్పోర్టివ్ గా ఉంటారని.. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని ఆయన ఇచ్చారని చెప్పుకొచ్చారు రష్మిక. అలానే విజయ్ దేవరకొండతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ఇలా చెప్పుకొచ్చింది. “కెరీర్ లో నేను ఎంతో కస్టపడి పైకి వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో.. విజయ్ సహకారం ఎప్పుడు ఉంటుంది. నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే.. దానికి విజయ్ సలహా తప్పకుండా తీసుకుంటాను. అది నాకు ఎంతో అవసరం కూడా. ఆ సమయంలో నాకు ఏది మంచో.. ఏది చెడో అతను వివరిస్తాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేసే వ్యక్తి విజయ్” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

అయితే, మరో వైపు సోషల్ మీడియాలో ఈ ఏడాది రష్మిక, విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. త్వరలోనే వారి వివాహ తేదీని కూడా అనౌన్స్ చేస్తారనే వార్తలు చాలా వినిపిస్తున్నాయి. అయితే, వీటిపై విజయ్ స్పందిస్తూ.. తానూ ఎవరిని నిశ్చితార్థం చేసుకోవడంలేదని.. తరచూ తన పెళ్లి మీద ఇటువంటి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయని.. తన పెళ్లి వార్తపై ఒక క్లారిటీ ఇచ్చాడు. అలాగే విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఫ్యామిలీ మ్యాన్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రష్మిక కూడా బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో “ఛావ” చిత్రంలో నటిస్తోంది. దానితో పాటు పుష్ప-2 చిత్రం కూడా వరుసలో ఉంది. కాబట్టి వీరిద్దరూ ప్రస్తుతానికి వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి, రష్మిక .. విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments