వీడియో: పరువు పోగొట్టుకున్న రమీజ్ రాజా! ఇంతకంటే ఘోరం మరోటి ఉండదేమో?

వీడియో: పరువు పోగొట్టుకున్న రమీజ్ రాజా! ఇంతకంటే ఘోరం మరోటి ఉండదేమో?

  • Author Soma Sekhar Published - 10:38 PM, Fri - 24 November 23

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ రమీజ్ రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కు గురవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో అతడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ రమీజ్ రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కు గురవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో అతడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 10:38 PM, Fri - 24 November 23

రమీజ్ రాజా.. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే.. భారత్ పై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అర్ధం పర్ధం లేని మాటలతో టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురౌతూ ఉంటాడు. తాజాగా తన తెలివి తక్కువ మాటలతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా ఏంటి బ్రో ఇలా ఉన్నావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో అతడు ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చీఫ్ రమీజ్ రాజా భారత్ ను ఎప్పుడు విమర్శిద్దామా అని ఎదురుచూస్తుంటాడు. అవకాశం చిక్కినప్పుడల్లా అర్ధం పర్ధం లేని మాటలతో నోరు జారుతూ ఉంటాడు. చౌకబారు వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తాడు రమీజ్ రాజా. తాజాగా తన తెలివితక్కువ తనంతో మరోసారి న్యూస్ లో నిలిచాడు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ..”క్రిస్టియన్ రోనాల్డో డైట్ ప్లాన్ ను నాసా సైంటిస్టులు తయ్యారు చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో.. రమీజ్ రాజాను ట్రోలర్స్ ఒక ఆటాడుకుంటున్నారు. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అయ్యిపోతున్నాయి’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. రోనాల్డోకి నాసా సైంటిస్టులకు సంబంధం ఏంటి? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం రమీజ్ రాజా చెప్పింది కరెక్టే.. మీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా? అంటూ వ్యంగ్యంగా రాసుకొస్తున్నారు. మరి ఫుట్ బాల్ దిగ్గజం రోనాల్డో డైట్ ప్లాన్ ను నాసా శాస్త్రవేత్తలు తయ్యారు చేస్తారు అన్న రమీజ్ రాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments