Ramadan Fasting: నేటి నుంచి రంజాన్ నెల ప్రారంభం.. ఉపవాసాలతో కలిగే ప్రయోజనాలు ఏంటి?

Ramadan Fasting: నేటి నుంచి రంజాన్ నెల ప్రారంభం.. ఉపవాసాలతో కలిగే ప్రయోజనాలు ఏంటి?

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ నెల ప్రారంభమైంది. నెల రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలను పాటించనున్నారు. అయితే.. ఈ ఉపవాస దీక్షల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ నెల ప్రారంభమైంది. నెల రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలను పాటించనున్నారు. అయితే.. ఈ ఉపవాస దీక్షల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పవిత్ర రంజాన్‌ మాసం మంగళవారంతో ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో.. ముస్లింలు రంజాన్‌ మాస ఉపవాస దీక్షలను ప్రారంభించారు. మార్చి 12 నుంచి రంజాన్‌ పండుగ ముందు రోజు వరకు ఈ ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. ఉదయం సూర్యుడు ఉదయించే ముందు అంటే 5 గంటల లోపే ఆహారం తీసుకుని ఉపవాస దీక్షను మొదలుపెడతారు. మళ్లీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే 6.30 తర్వాత ఒక నిర్దిష్టమైన సమయానికి ఉపవాసాన్ని విడుస్తారు. ఆ మధ్యలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు. ఈ ఉపవాస దీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే.. రంజాన్‌ ఉపవాస దీక్షల వెనుక ఉన్న మత నియమాలు గురించి పక్కనపెడితే.. ఈ ఉపవాస దీక్షల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఉపవాస దీక్షలు బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు కరగడానికి ఉపయోగపడతాయి. పగటి పూట ఆహారం తీసుకోరు కనుక జీవక్రియ కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది శరీరంలో కొవ్వును కరిగించి.. శక్తిని ఇస్తుంది. అలాగే రంజాన్‌ నెల మొత్తం ఉపవాసం ఉండటం వల్ల శరీరాన్ని ఫిల్టర్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. 12 నుంచి 14 గంటల పాటు ఉపవాసం చేయడం వల్ల కాలేయంలోని గ్లైకోజెన్‌ క్షీణించి తిరిగి నిండుతుంది. ఈ నిరంతర క్యాలరీ నియంత్రిత ఆహారం ప్రేగులను శుభ్రపర్చడానికి సహాయపడుతుంది. రంజాన్‌ ఉపవాసాల వల్ల శరీరంలో ఇన్సులిన్‌ను కూడా నియంత్రించవచ్చు. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించేందుకు ఉపవాస దీక్షలు ఉపయోగపడతాయి.

అలాగే బాడీలోని విసెరల్‌ కణాలను కడూఆ రిపేర్‌ చేయడానికి సహాయపడుతుంది. ఉపవాసాల వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపవాసం ఒక మ​ంచి మార్గం. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల శరీరంలో దీర్ఘకాలిక వ్యాధులకు కారణంగా చెబుతుంటారు. ఉపవాసం వల్ల ఈ ఆక్సీకరణ ఒత్తిడి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో శరీరంలో మంట లాంటి సమస్యలను కూడా నివారించవచ్చు. అయితే.. ఈ ఉపవాస దీక్షలు పాటించే వారు.. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎండకాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే బాడీ డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. ఎండలో తిరగకుండా ఉంటే మంచింది. మరి ఉపవాస దీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments