AUS vs SA: సెమీస్ లో సౌతాఫ్రికా ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

సెమీస్ లో సౌతాఫ్రికా ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

  • Author Soma Sekhar Published - 08:22 AM, Fri - 17 November 23

వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది దక్షిణాఫ్రికా జట్టు. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు 30 ఏళ్ల స్టార్ క్రికెటర్.

వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది దక్షిణాఫ్రికా జట్టు. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు 30 ఏళ్ల స్టార్ క్రికెటర్.

  • Author Soma Sekhar Published - 08:22 AM, Fri - 17 November 23

వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా పోరాటం ముగిసింది. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి నాకౌట్స్ దశను దాటలేకపోయింది. తాజాగా ఆసీస్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. స్వల్ప స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో కంగారూ టీమ్ 3 వికెట్ల తేడాతో సఫారీ జట్టును ఓడించి ఫైనల్లో టీమిండియాను ఢీకొనేందుకు సిద్దమైంది. ఇక సౌతాఫ్రికా ఓటమితో రిటైర్మెంట్ ప్రకటించాడు ఆ జట్టు స్టార్ ప్లేయర్.

వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. చివరి వరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ.. జట్టుకు గెలుపును మాత్రం అందించలేకపోయారు. 213 స్వల్ప లక్ష్యాన్ని తడబడుతూ 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది కంగారూ టీమ్. దీంతో దిగ్విజయంగా 8వ సారి ఆసీస్ వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉండగా.. సఫారీ జట్టు ఓటమితో ఆ టీమ్ స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. వన్డేలకు రిటైర్మెంట్ వీడ్కోలు ఇస్తున్నట్లు తెలిపాడు. గత కొన్ని రోజులుగా ఇదే తన చివరి వన్డే వరల్డ్ కప్ అని చెబుతూనే వస్తున్నాడు డికాక్. ఈ మెగాటోర్నీలో అద్భుతంగా రాణించి 4 సెంచరీలతో 594 రన్స్ చేశాడు.

కాగా.. ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ ప్లేయర్ తాజాగా వన్డేలకు వీడ్కోలు పలికాడు. అయితే టీ20లు మాత్రం ఆడనున్నాడు. 30 ఏళ్లకే వన్డేలకు డికాక్ గుడ్ బై చెప్పడం క్రికెట్ వర్గాలనే కాక.. అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 రన్స్ కే ఆలౌట్ అయింది. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(101) సెంచరీతో చెలరేగడంతో ఆ మాత్రం స్కోర్ సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తడబడుతూనే విజయాన్ని సాధించింది. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కంగారూ టీమ్ లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 62 రన్స్ తో రాణించి విజయాన్ని అందించాడు. నవంబర్ 19న(ఆదివారం) టీమిండియాతో ఫైనల్లో తలపడనుంది ఆసీస్.

Show comments