పదేళ్లుగా ప్లే ఆఫ్స్‌ గడప తొక్కని ఏకైక చెత్తగా టీమ్‌! IPL చరిత్రలోనే తొలిసారి..

పదేళ్లుగా ప్లే ఆఫ్స్‌ గడప తొక్కని ఏకైక చెత్తగా టీమ్‌! IPL చరిత్రలోనే తొలిసారి..

Punjab Kings, IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్‌కు రీచ్‌ కానీ టీమ్‌గా ఓ జట్టు అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మరి ఆ టీమ్‌ ఏంటో, వారి కథేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Punjab Kings, IPL 2024: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్‌కు రీచ్‌ కానీ టీమ్‌గా ఓ జట్టు అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మరి ఆ టీమ్‌ ఏంటో, వారి కథేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ అంటేనే ధనాధన్‌ క్రికెట్‌కు, రికార్డులకు, ట్రోఫీలకు పెట్టింది పేరు. ట్రోఫీ కొట్టాలనే కసితోనే అన్ని టీమ్స్‌ బరిలోకి దిగుతుంటాయి. కానీ, ఇప్పటి వరకు 16 సీజన్ల ఐపీఎల్‌ ముగిస్తే.. ఈ 16 ఏళ్లలో కేవలం రెండు టీమ్స్‌ మాత్రమే ఐపీఎల్‌ను డామినేట్‌ చేశాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌.. గత 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో 10 టైటిల్స్‌ ఈ రెండు టీమ్స్‌ వద్దే ఉన్నాయి. చెరో ఐదుసార్లు కప్పుకొట్టి.. ఐపీఎల్‌ను శాసిస్తున్నాయి. వీటి తర్వాత కేకేఆర్‌ కాస్త పర్వాలేదు. ఆ జట్టు వద్ద రెండు టైటిల్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా గతంలో ఒక్కసారి ట్రోఫీలు గెలిచాయి. పాత టీమ్‌ డెక్కన్‌ ఛార్జర్స్‌ కూడా ఓ సారి ఐపీఎల్‌ కప్పు కొట్టింది.

కానీ, కొన్ని టీమ్స్‌ ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్‌ కప్పును టచ్‌ చేయలేదు. అందులో ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్‌ టీమ్స్‌ ఉన్నాయి. కప్పు గెలవాలన్న ఒత్తిడి ఢిల్లీ, పంజాబ్‌ల కంటే కూడా ఆర్సీబీపై ఎక్కువ ఉంది. ఎందుకంటే.. ఆ టీమ్‌లో విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. దాంతో పాటు ఆర్సీబీకి ఉన్న భారీ ఫాలోయింగ్‌ కూడా అందుకు కారణం. అయితే.. ఐపీఎల్‌ కప్పు కాదు కదా.. గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్‌కు వెళ్లని టీమ్‌ ఒకటుంది. అదే పంజాబ్‌ కింగ్స్‌. 2015 నుంచి ఈ సీజన్‌ వరకు పంజాబ్‌ కింగ్స్‌ కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌ నుంచి నిష్క్రమించింది.

ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ నుంచి ఎలిమినేట్‌ అవ్వగా.. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ కేవలం 4 విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. అయితే.. చివరి సారిగా 2014లో ఫ్లే ఆఫ్స్‌కి వెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆ తర్వాత వరుసగా పదేళ్ల పాటు ప్లే ఆఫ్స్‌కు వెళ్లని ఏకైక టీమ్‌గా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ కింగ్స్‌ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అందులో 2014లో టేబుల్‌ టాపర్‌గా ఉండి, ఫైనల్స్‌ కూడా ఆడింది. కానీ, ఫైనల్‌లో కేకేఆర్‌ చేతిలో ఓడిపోయి.. రన్నరప్‌గా మిగిలింది. మరి పంజాబ్‌ పేరిట నమోదైన ఈ చెత్త రికార్డ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments