Actor Bijoy Sankar Saikia: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

  • Author ajaykrishna Published - 03:35 PM, Fri - 7 July 23
  • Author ajaykrishna Published - 03:35 PM, Fri - 7 July 23
ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో ఊహించని విధంగా సెలబ్రిటీల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి మరణాన్ని మరువకముందే మరో సెలబ్రిటీ కన్నుమూయడం అనేది ఫ్యాన్స్ కి తీరని బాధ కలిగిస్తోంది. తాజాగా మరో సీనియర్ నటుడు చిన్న వయసులోనే కన్నుమూసిన విషాద వార్త పరిశ్రమను కుదిపేస్తోంది. సీనియర్ నటుడు బిజాయ్ శంకర్ సైకియా.. జులై 6న తేజ్ పూర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే కావడం అందరిని షాక్ కి గురి చేస్తున్న విషయం. బిజాయ్ శంకర్.. అస్సామీ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన నటుడు.

ఇక బిజాయ్గ మరణానికి ల కారణం.. గుండెపోటు అని తెలుస్తోంది. అస్సామి ఇండస్ట్రీలో బిజాయ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు మంచి పేరుంది. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కాగా.. బిజాయ్ చిన్నతనం.. విద్యాభ్యాసం అంతా తేజ్ పూర్ లోనే సాగింది. ఆయన గౌహతి యూనివర్సిటీ నుండి 2008లో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. కెరీర్ లో సినిమాలతో పాటు టీవీ యాడ్స్, టీవీ సిరీస్ లు సైతం చేసినట్లు తెలుస్తుంది. అయితే.. బిజాయ్ శంకర్.. దివంగత అస్సామి యాక్టర్ ఉదయ్ శంకర్ సైకియా కుమారుడు. ఇక బిజాయ్ చివరిగా డాక్టర్ బెజబారూ 2 మూవీలో నటించారు. ప్రస్తుతం బిజాయ్ మరణం పట్ల అటు ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments