గ్రాండియర్ అద్భుతం - ఎమోషన్లే అనుమానం

గ్రాండియర్ అద్భుతం – ఎమోషన్లే అనుమానం

ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కి ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే స్టేజిని పంచుకోవడం దీని ద్వారానే సాధ్యమయ్యింది.

ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కి ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే స్టేజిని పంచుకోవడం దీని ద్వారానే సాధ్యమయ్యింది.

నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగిన వేడుకలో మణిరత్నం మాగ్నమ్ ఓపస్ సినిమా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కి ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే స్టేజిని పంచుకోవడం దీని ద్వారానే సాధ్యమయ్యింది. రజినికి దళపతి, కమల్ కు నాయకుడు లాంటి ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడిగా ఆయన మీద గౌరవంతో ఇద్దరూ అక్కడికి విచ్చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య రాయ్ ని ఒక సౌత్ ఈవెంట్ లో చూడటం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. మొత్తం క్యాస్టింగ్ హాజరయ్యారు.

మూడు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ లో కథ లైన్ ఏంటో లైట్ గా చెప్పారు. వెయ్యి సంవత్సరాల క్రితం చోళ రాజ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించారు. రాజులూ, సేనాపతులు, పట్టపుమహిషి, శత్రువులు, రాజగురువులు ఇలా సెటప్ మొత్తం చాలా వైభవంగా అకనిపించింది. చారిత్రాత్మక నవల ఆధారంగా అదే టైటిల్ తో మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. ఇన్ని దశాబ్దాల కెరీర్ లో ఆయన ఈ స్థాయిలో గ్రాఫిక్స్ వాడటం ఇదే మొదటిసారి. రోజానుంచి మొదలై పాతికేళ్ళుగా కొనసాగుతున్న ఏఆర్ రెహమాన్ తో బంధాన్ని ఇందులోనూ కొనసాగించారు. తన మార్కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రెహమాన్ సన్నివేశాలకు మంచి లైఫ్ ఇచ్చారు.

అంతా బాగానే ఉంది కానీ ప్రతిసారి ఇలాంటి సినిమాలను బాహుబలితో పోల్చుకున్న తమిళ జనాలను బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఈ పొన్నియన్ సెల్వన్ లో ఎమోషన్లు ఉంటాయా అంటే చెప్పలేకపోతున్నారు. ట్రైలర్ కట్ లో ఆర్టిస్టులను రివీల్ చేశారు తప్ప వాళ్ళ మధ్య బలమైన భావోద్వేగాలున్నట్టు రిజిస్టర్ చేయలేకపోయారు. కేవలం ఈ త్రీ మినిట్ వీడియోతో మొత్తం జడ్జ్ చేయలేం కానీ ఏదో చిన్న అసంతృప్తి మాత్రం కలుగుతుంది. అసలే మనకు అంతగా అలవాటు లేని ఆరవ వ్యవహారాలు ఇక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఎలా చూపిస్తారో. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అందుకోబోతున్న పీఎస్ 1తో మణిరత్నం కంబ్యాక్ అవుతారని ఫాన్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు

Show comments