Ponnam Prabhakar-Double Bed Room Houses: మంత్రి కీలక ప్రకటన.. వారందరికీ డబుల్‌బెడ్రూం ఇళ్లు.. ఎప్పుడంటే

మంత్రి కీలక ప్రకటన.. వారందరికీ డబుల్‌బెడ్రూం ఇళ్లు.. ఎప్పుడంటే

Double Bed Room Houses: తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తోన్న వారి కలలు త్వరలోనే నెరవేరుతాయని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి పొన్నం కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Double Bed Room Houses: తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తోన్న వారి కలలు త్వరలోనే నెరవేరుతాయని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి పొన్నం కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లపై కీలక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటి జాగాతో పాటు.. నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించినప్పటికి.. వాటి పంపిణీ పూర్తి కాలేదు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. భాగ్యనగరం జిల్లాలో అర్హులైన వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు.. హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్‌ పనుల పురోగతిపై బుధవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం. ఈ సందర్భంగా ఆయన డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ఈ ప్రకటన చేశారు. జిల్లాలో ఏడు ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని అర్హులైన వారికి.. ఆ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు.

అలానే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మంత్రి పొన్నం శుభవార్త చెప్పారు. వారికి పెరిగిన డైట్‌ ఛార్జీలు అమలు చేస్తామని తెలిపారు. జీవో 58, 59లకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ భవన నిర్మాణం కూడా త్వరలోనే చేపడతామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలానే ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో కొత్తగా చేపల మార్కెట్లు నిర్మించే ఆలోచన ఉందని మంత్రి పొన్నం వివరించారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒక చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు.

Show comments