Gender Reveal Party: పార్టీలో విషాదం.. సందడి చేస్తూ.. కళ్ల ముందే పేలిన విమానం!

పార్టీలో విషాదం.. సందడి చేస్తూ.. కళ్ల ముందే పేలిన విమానం!

అప్పటి వరకు ఆ పార్టీ బంధుమిత్రుల కేకలు, చప్పుట్లతో ఎంతో సంతోషంగా ఉండింది. ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నామన్న సంతోషంలో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీకి వచ్చిన వారితో నవ్వుతూ, తుళ్లుతూ తిరగసాగారు. ఇలాంటి సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పార్టీలో మరింత ఊపు తెచ్చేందుకు వచ్చి… ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. గాల్లో పేలి నేల కొరిగింది. ఈ సంఘటనలో ఓ పైలట్‌ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మెక్సికోలో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని సినలోనాకు చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. మరికొన్ని రోజుల్లో ఆమె డెలివరీ ఉంది. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్తతో కలిసి ‘జెండర్‌ రివీలింగ్‌ పార్టీ’ని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారు. సెప్టెంబర్‌ 2న వేడుక జరిగింది. ఆ దంపతులు బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా పార్టీని ఎంజాయ్‌ చేయసాగారు. ఆ వేడుకలో మరింత సందడి చేసేందుకు.. ఓ చిన్న విమానం​ బరిలోకి దిగింది. అటు,ఇటు తిరుగుతూ కనువిందు చేయసాగింది.

ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. గాల్లో ఎగురుతూనే పేలింది. దీంతో విమానాన్ని నడుపుతున్న పైలట్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. కళ్లముందే విమానం కుప్పకూలటంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అనుకోని ఘటన ‘ జెండర్‌ రివీలింగ్‌ పార్టీ’లో విషాదం నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ‘ జెండర్‌ రివీలింగ్‌ పార్టీ’లో విమానం కుప్పకూలటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments