Pindam Movie: భయంతో వణికించే పిండం మూవీ OTTలోకి.. ఎప్పటి నుండంటే?

Pindam OTT:భయంతో వణికించే పిండం మూవీ OTTలోకి.. ఎప్పటి నుండంటే?

Pindam Movie OTT Release Date: నటుడు శ్రీరామ్ నటించిన తాజా చిత్రం పిండం. ఈ సినిమా థీయేటర్ లో విడుదలై ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడంటే..

Pindam Movie OTT Release Date: నటుడు శ్రీరామ్ నటించిన తాజా చిత్రం పిండం. ఈ సినిమా థీయేటర్ లో విడుదలై ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడంటే..

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో చిన్న పెద్ద అని తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ తరహాలోనే.. విడుదలైన బలగం, బేబి, సామజవరగమన, సీతారామం వంటి చిన్న చిన్న సినిమాలన్నీ భారీ విజయాలను అందుకొని కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అలాగే కంటెట్ బాగున్న సినిమాలకి ప్రమోషన్స్ కూడా పెద్దగా అవసరం లేదు. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే విపరీతంగా జనాల్లో క్లిక్ అవుతున్నాయి. ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇలాంటి సినిమాలకు భయపడుతూనే.. ఆసక్తిగా చూస్తారు. కాగా, ఇటీవలే విడుదలైన భయంకరమైన హరర్ సినిమాలో ఒకటి పిండం. ఈ పిండం సినిమా విడుదలై ఆడియన్స్‌ను వణింకించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పిండం మూవీ.. ఓటీటీలో కూడా భయపెట్టించడానికి సిద్ధం అవుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నటుడు శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లేటెస్ట్ మూవీ పిండం. ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయికిరణ్ తెరకెక్కించగా.. కళాహి మీడియా బ్యానర్‌పై హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 15న థీయేటర్ లో విడుదలై మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా పిండం సినిమా ఓటీటీలో హడలెత్తించడానికి రెడీగా ఉంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డేట్ కూడా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. చాలావరకు హర్రర్ ల్లో ది బెస్ట్ హర్రర్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. అలాగే పిండం సినిమా న్యూ ఇయర్ కానుకగా 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో.. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. నెట్ ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పలు హింట్స్ కూడా ఇస్తోంది.

ఇక ఈ పిండం సినిమా థీయోటర్లో రాకముందు.. టీజర్, ట్రైలర్ విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. చాలవరకు హరర్ థ్రిల్లర్ సినిమా అంటే లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్  ఉండడం సహజం. కానీ, ఎటువంటి కామెడీ లేకుండా.. చాలారోజులకి మంచి హరర్ మూవీ రూపొందించరంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. ఇక ఈ సినిమాలో హీరో శ్రీరామ్ తో పాటు ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్‌, రవివర్మ తదితరులు నటించారు. మరి, పిండం సినిమా త్వరలో ఓటీటీ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments