Pawan Kalyan: మరోసారి చేతగానితనం బయటపెట్టుకున్న పవన్!

Pawan Kalyan: మరోసారి చేతగానితనం బయటపెట్టుకున్న పవన్!

మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ప్రసంగంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ప్రసంగంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా రాజకీయాలు అనేవి వ్యక్తిగత సంబంధాలను దూరం చేయవు. ఎంతో మంది మధ్య రాజకీయంగా విబేధాలు ఉన్నా వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. అలానే మరెందరో వ్యాపారాలు కూడా చేస్తుంటారు. అందుకే రాజకీయంగా పరస్పరం కత్తులు దూసుకుంటూ ఒకే కాంట్రాక్టును కలిసి పంచుకునే రాజకీయ పార్టీల నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న పొటిలికల్ సెక్టార్ లో పవన్ కల్యాణ్ ఇంటి స్థలం కొనుక్కోలేకపోయారంట. మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జనసైనికులను ఆశ్చర్యానికి గురి చేశాయి.

మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను ఎందుకు తక్కువ సీట్లు అడిగానే వివరించారు. తాను భీమవరంలో కంటే పులివెందులలో ఓడిపోయిన సంతోషించే వాడినంటూ చెప్పుకొచ్చారు. వీటితో పాటు తాను  ఐదేళ్లుగా భీమవరంలో సొంత ఇళ్లు కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నాని, కనీసం అద్దె ఇంటి కోసం ప్రయత్నించినా కుదరలేదని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మరోసారి తన చేతకానితనాన్ని బయట పెట్టుకున్నారని అంటున్నారు.

పవన్ కల్యాణ్ భీమవరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారట. ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నించారట. కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలని కూడా అనుకున్నారట. కనీసం ఒక స్థలం అయినా కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని భావించారంట. కానీ.. అక్కడివాళ్లెవరూ ఆయనకు అమ్మలేదని, అంతేకాక పవన్ కి అమ్మాలనుకుంటున్న వారినందరినీ  స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ భయపెడుతున్నాడని చెప్పుకొచ్చారు. ఈ పవన్ చేసిన ఈ మాటలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

భీమవరంలో ఏమైనా పవన్ కల్యాణ్ కు మాత్రం పరిమితమైన ఆర్టికల్ 370 ఉందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.  అక్కడి ప్రజలు ఆయనకు అమ్మడానికి ఇష్టపడకపోతే దానిని ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తే ఎలా?, 2019 ఎన్నికల్లో పవన్ ను అభిమానించి 62 వేల మంది ఓట్లు వేశారు. వారిలో ఒక్కరు కూడా ఆయనకు ఇల్లు కనీసం అద్దెకు కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదా, అలా వాళ్లు ఇవ్వలేదు అంటే అది పవన్  చేతగానితనమే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భీమవరంలో సొంత ఇల్లు ఉండాలనుకున్నా, నాకు ఓట్లు ఎవరు వెయ్యలేదు, నన్ను గెలిపించలేదు అంటూ చిల్లర మాటలు చెప్పుకుంటూ, అంతేకాక ఎమ్మెల్యేను చిల్లర మాటలతో చేసే చీప్ రాజకీయం గెలిపించదని పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని పలువురు అభిప్రాయా పడుతున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేసే తప్పులు ఉంటే, ఆ విషయాలను చెప్పి ప్రజల ఆదరణ కోరుకోవాలే గానీ ఇలాంటి మాటలు పనికి రావని ఆయన తెలుసుకోవాలి, అంతేకాక అతని చేతకాని తనానికి నిదర్శనమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

Show comments