Pawan Kalyan: పూటకో రంగు మారుస్తున్న పవన్... ఫ్యాన్స్ సీరియస్!

పూటకో రంగు మారుస్తున్న పవన్… ఫ్యాన్స్ సీరియస్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల వ్యవహారం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తాడో, ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అయోమయంలో ఆయన అభిమానులు ఉన్నారని టాక్. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల వ్యవహారం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన ఎప్పుడు ఎవరితో కలిసి నడుస్తాడో, ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అయోమయంలో ఆయన అభిమానులు ఉన్నారని టాక్. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంటి నేటి వరకు ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రం ప్రజల్లో నిలబడిపోయాయి. అలాంటి వాటిల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ వంటివి ఉన్నాయి. ఈ పార్టీలు జనాల్లో అంత బలంగా ఉండటానికి కారణం.. వారు తీసుకునే నిర్ణయాలు.. చేపట్టే కార్యక్రమాలు. అలానే జనసేన సైతం ప్రజల్లోకి వచ్చింది. జనసేన పార్టీ ఏర్పడి దాదాపు 10 ఏళ్లు అవుతుంది. కానీ పార్టీ అధినేత నిర్ణయాలతో  ఇప్పటికి ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయింది. ఇక పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని ఆశలు పెట్టుకున్న జనసైనికులు,  అభిమానులపై నీళ్లు చల్లుతున్నాడు. పూటకో రంగు మారుస్తున్న పవన్  ఎవరు నమ్ముతారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

జనసేన అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఫ్యాన్స్ ను ఆగ్రహాన్నికి గురి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడో కూడ తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.  అసలు పార్టీ పెట్టిన అసలు ఉద్దేశం ఏమిటో మర్చిపోయాడు. ఒక సిద్ధాంతం, పద్ధతి అంటీూ ఏమీ లేనట్లు.. అవసరాన్ని బట్టి ఎలాంటి పార్టీతో అయినా పొత్తులు పెట్టేసుకోవడం ప్రజల్లో పవన్ బకరాను చేస్తోందని కొందరు అభిప్రాయాపడుతున్నారు.

వాస్తవంగా చూస్తే.. ఆయనకు చాలా అవకాశాలు ఉన్నాయి. బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అంతేకాక బలమైన సామాజివర్గం నుంచి పవన్ వచ్చారు. ఇవన్నీ ఆయనకు బాగా కలిసొచ్చే అంశాలే..కానీ పవన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయంగా ఫెయిల్ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. తనను నమ్ముకుని తన వెంట నడుస్తు్న వారి ఆశయాలను ఇతరుల కాళ్ల దగ్గర పెట్టేస్తుండాని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తుల్లో ఆయనకు స్థిరత్వం లేదు. మొన్నటి వరకు ఎన్డీఏలో ఉండి, ఇప్పుడు చంద్రబాబు వంచన చేరాడు.

గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కూడా కలిసి వెళ్లాడు. దీంతో ఆయన  పూటకో రంగు మారుస్తుండటంతో  జనసైనికులు కూడా పవన్ ని నమ్మే పరిస్థితులు లేవనే టాక్ నడుస్తోంది.  ఇన్ని రోజులు తమకు టికెట్లు వస్తాయని పోటీ చేయొచ్చనే ఆలోచనతో ఉన్న వారికి.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారంట. ఇప్పటి వరకు కష్టపడి పని చేసి.. ఇప్పుడు పొత్తులో భాగంగా తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో  టీడీపీ నేతలు టికెట్లు ఎగరేసుకుని పోతే..  చివరకు ఆ పార్టీ నేతల  గెలుపు కోసం తాము పని చేయాలా అంటూ నిలదీస్తున్నారు.

ఇలా సొంత పార్టీ నేతలే పవన్ ను నమ్మే పరిస్థితులు లేవని, ఇక  తాము ఎలా నమ్ముతామని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎవరైన నాయకుడు అనే వాడు… తన పార్టీ కోసం, తనను నమ్ముకున్న వారి కోసం పని చేయాలి. కానీ.. ఇతర పార్టీల  వారికోసం నమ్మిన వారిని బలి చేయడం ఏంటని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. పవన్ కల్యాణ్ పూటకో రంగు మారుస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments