OTT Suggestions- Must Watch Movie: స్టార్ హీరోయిన్‌తో.. సామాన్యుడి లవ్ ట్రాక్! OTTలో సూపర్ రొమాంటిక్ సిరీస్!

స్టార్ హీరోయిన్‌తో.. సామాన్యుడి లవ్ ట్రాక్! OTTలో సూపర్ రొమాంటిక్ సిరీస్!

ఈ వారం బెస్ట్ ఓటీటీ సిరీస్ కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. స్టార్ హీరోయిన్‌తో.. సామాన్యుడి లవ్ స్టోరీతో నడిచే ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ చూశారా..?

ఈ వారం బెస్ట్ ఓటీటీ సిరీస్ కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. స్టార్ హీరోయిన్‌తో.. సామాన్యుడి లవ్ స్టోరీతో నడిచే ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ చూశారా..?

థియేటర్లలో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఓటీటీ వచ్చాక సిరీస్ చూడటం అలవాటు అయిపోయింది ప్రేక్షకులకు. వీకెండ్ వస్తే కనీసం రెండు వెబ్ సిరీస్‌లైనా చూడాలనుకుంటున్నారు. కొత్తవి కాకపోయినా పాతవి, ఎప్పుడైనా చూద్దాంలే అని పోస్టు పోన్ చేసినవి, మంచి టైం పాస్ అయ్యే సిరీస్ కోసం వెతుకుతుంటారు. ఈ వీకెండ్ కోసం కూడా బెస్ట్ ఓటీటీ సిరీస్ కోసం చూస్తున్నారా..? అయితే అలాంటి ఓ వెబ్ సిరీసే ఇది. రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా మిళితమై ఉంటుంది. ట్విస్టులు, టర్న్ ఏమీ ఉండవు కానీ.. మ్యాజిక్ అయితే చేశాడు దర్శకుడు. ఓ సాధారణ అబ్బాయి, ఓ స్టార్ హీరోయిన్ మధ్య నడిచే ప్రేమ కథ.

ఇంతకు ఆ వెబ్ సిరీస్ ఏంటంటే.. ది బేకర్ అండ్ ది బ్యూటీ. 2021లో రిలీజైంది ఈ వెబ్ సిరీస్. ఇందులో అన్నా దమ్ములు నటించడం విశేషం. సంతోష్ శోభన్ లీడ్ రోల్ చేయగా.. అతడి రియల్ తమ్ముడు, మ్యాడ్ మూవీతో మనల్ని తన మ్యాడ్‌లో పడేసిన సంగీత్ శోభన్.. రీల్‌లో కూడా సోదరుడిగా నటించాడు. టీనా శిల్పరాజ్, ఒకప్పటి స్టార్ హీరో వెంకట్, విష్ణు ప్రియ, ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యర్ కీలక పాత్రలు పోషించారు. జోనాథన్ ఎడ్వర్డ్స్ ఈ వెబ్ సిరీస్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్. . 2021 సెప్టెంబర్ 10 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే..

విజయ్ (సంతోష్ శోభన్) తన తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్) బేకరిలో పనిచేస్తూ.. అమ్మ (ఝాన్సీ)కి సూపర్ మార్కెట్‌లో చేదోడువాదోడుగా ఉంటాడు. విజయ్ కు తమ్ముడు (సంగీత్), సోదరి ఉంటారు. చిన్న ఫ్యామిలీ, సామాన్య మధ్య తరగతి కుటుంబం. అతడు గర్ల్ ఫ్రెండ్ మహి (విష్ణు ప్రియ) తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరుతుంది. అంతలో అతడికి స్టార్ హీరోయిన్ వాసిరెడ్డి ఐరా (టీనా శిల్పరాజ్)పరిచయం ఏర్పడుతుంది. టీనా గతంలో ఓ బాలీవుడ్ హీరో ప్రేమలో పడుతుంది కానీ అది బ్రేకప్ అయ్యి.. హైదరాబాద్ వచ్చింది. ఒక సామాన్యుడికి సెలబ్రిటీతో లవ్ ట్రాక్ నడుస్తుంది. ఐరాను ఆమె అసిస్టెంట్ లక్ష్మి (వెంకట్) వీరిద్దరిని విడదీసేందుకు విజయ్ మాజీ ప్రేయసి మహితో కలిసి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.

ఐరా, విజయ్ ఎలా ప్రేమలో పడతారు.. వీరి మధ్య మనస్పర్థలు ఎందుకు వస్తాయి.. మహిని కాదని విజయ్ ఐరాను ఎందుకు ప్రేమిస్తాడు. ఐరా, విజయ్‌ను మహి అండ్ లక్ష్మీ ఎందుకు విడదీయాలనుకుంటున్నారు అనేది ఈ వెబ్ సిరీస్‌లో చూడండి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కాబట్టి.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సిరీస్ తెరకెక్కించింది. ఇక దర్శకుడు తాను అనుకున్నది తెరపైన ప్రజెంట్ చేయగలిగాడు కానీ.. అక్కడక్కడా కాస్త కథనం మందగిస్తూ ఉంటుంది. మిగతా అంతా కామెడీ అండ్ లవ్ ట్రాక్‌తో మనల్ని కథలోకి తీసుకెళుతూనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇక స్టార్ చేయండిక. ఇది సీజన్ 1,  మరీ దీనికి కొనసాగింపు ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

Show comments