OTT Suggestions Suspense Thriller: OTT తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ కి ఊపిరి ఆగిపోవాల్సిందే..

OTT తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ కి ఊపిరి ఆగిపోవాల్సిందే..

OTT Suggestions Suspense Thriller: ఓటీటీలో తెలుగులో ఒక అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. మరి.. ఆ సినిమా ఏదో చూడండి.

OTT Suggestions Suspense Thriller: ఓటీటీలో తెలుగులో ఒక అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. మరి.. ఆ సినిమా ఏదో చూడండి.

ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. ఒక్కో జానర్ కి వందల కొద్దీ సినిమాలు వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, మనకు దొరికే కొద్దిపాటి సమయంలో అన్నీ సినిమాలు చూడాలి అంటే వల్లకాదు. అందుకే ది బెస్ట్ చిత్రాలు మాత్రమే చూడాలి అనుకుంటాం. అలాంటి వారికోసం మేము కంటిన్యూగా ఓటీటీ సజీషన్స్ ఇస్తూనే ఉన్నాం. ఇవాళ మీకోసం ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ మూవీలో ఒక్కో సీన్ మీ ఊపిరిని బిగపట్టేలా చేస్తుంది. ఇది హాలీవుడ్ చిత్రం అయినా కూడా ఓటీటీలో మీకు తెలుగులోనే అందుబాటులో ఉంది. మరి.. ఆ మూవీ ఏది? అందులో అంత స్పెషల్ ఏముందో చూద్దాం.

ఇంత హైప్ క్రియేట్ చేస్తోంది.. డోంట్ బ్రీత్ అనే హాలీవుడ్ సినిమాకే. ఈ మూవీలో బ్లైండ్ మ్యాన్ గా లీడ్ రోల్ ప్లే చేసిన స్టీఫెన్ లంగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అవతార్ సినిమాలో కమాండర్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కూడా అదే తరహా నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ మూవీలో ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అబ్బుర పరుస్తుంది. ఒక చూపులేని వ్యక్తిగా స్టీఫెన్ నటన, పోరాటం మెప్పిస్తుంది. ఒక బ్లైండ్ మ్యాన్ కి ఎంత సామర్థ్యం ఉంటుంది? అతను ఏం చేయగలడు అనే విషయాలు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ మూవీలో మనం ఇప్పటికే చూశాం. ఈ మూవీలో అంతకు మించి ఉంటుంది. ఒక్కొక్కరిని ముప్పతిప్పలు పెడతాడు. ముగ్గురు చూపు ఉన్న వ్యక్తులను కూడా ఒక చూపులేని వాడు, ముసలివాడు అల్లాడించేస్తాడు.

ఈ డోంట్ బ్రీత్ సినిమా 2016లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ సినిమా అయినా మనకి తెలుగులోనే అందుబాటులో ఉంది. పైగా ఈ మూవీకి 2021లో పార్ట్ 2ని కూడా తీసుకొచ్చారు. ఆ డోంట్ బ్రీత్ 2 మూవీ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఉండే నటులు మొత్తం తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అంతా బాగా నచ్చేయడానికి నిడివి కూడా కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ మూవీ కేవలం గంటన్నర మాత్రమే ఉంటుంది. ఒక రోజు రాత్రి జరిగిన ఘటన ఆధారంగానే కథ మొత్తం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నిడివి పెట్టినా ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. మొత్తానికి ఈ డోంట్ బ్రీత్ సినిమా మాత్రం మిమ్మల్ని మెప్పిస్తుంది.

కథ ఏంటంటే?:

రాకీ, అలెక్స్, మనీ అనే ముగ్గురు ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఒక మంచి దొంగతనం చేసి లైఫ్ సెట్ చేసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. అలాంటి వారికి గల్ఫ్ వార్ వెటరన్ నార్మన్ నార్డ్ స్టార్మ్ దగ్గర 3 లక్షల డాలర్లు ఉన్నట్లు సమాచారం అందుకుంటారు. అతను బ్లైండ్ కాబట్టి వారి పని మరింత సులభం అవుతుందని భావిస్తారు. కానీ, వారి ఆలోచన తప్పు అని ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుంది. ముగ్గురిలో ఒకరిని నార్మన్ కాల్చి చంపేస్తాడు. మిగిలిన ఇద్దరూ ఇంట్లో ఇరుక్కుపోతారు. వాళ్లు తప్పించుకున్నారా? అసలు ప్రాణాలు కాపాడుకున్నారా? అనేదే కథ. మరి.. డోంట్ బ్రీత్ మూవీ మీరు చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments