OTTలో థ్రిల్లింగ్ సినిమా.. స్టార్ట్ చేస్తే చివరి వరకూ కదలరంతే!

OTTలో థ్రిల్లింగ్ సినిమా.. స్టార్ట్ చేస్తే చివరి వరకూ కదలరంతే!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. మరి, వాటిలో ఏది బెస్ట్ మూవీనో తెలుసుకోవడం ఎలా .. అయితే, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికీ మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఒక బెస్ట్ సజ్జెషన్.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. మరి, వాటిలో ఏది బెస్ట్ మూవీనో తెలుసుకోవడం ఎలా .. అయితే, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికీ మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఒక బెస్ట్ సజ్జెషన్.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలకు, సిరీస్ లకు కొదవే లేదు. చూసే ఓపిక ఉండాలే కానీ, రోజుల తరబడి కదలకుండా చూసిన కూడా.. తరిగిపోనాన్ని సినిమాలు, సిరీస్ లు ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చాయి. కామెడీ, సస్పెన్స్, లవ్ , డ్రామా ఇలా అన్ని జోనర్స్ లో ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ప్రతి వారం ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ చేస్తున్నారనే లిస్ట్ తో పాటు.. ఏ సినిమా చూస్తే బావుంటుంది అనే సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అందరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతున్నారు. అలాంటి వారికీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుందని చెప్పి తీరాలి. ఆ సినిమా పేరే “అదృశ్యం”. అసలు ఈ సినిమాను ఎందుకు మిస్ కాకుండా చూడాలి! ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ! అనే విషయాలు చూసేద్దాం.

అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కు సడన్ గా ఒక అమ్మాయి వస్తుంది. ఆ ప్రాంతమంతా కూడా చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది. సడన్ గా ఈ అమ్మాయి స్టేషన్ లోకి వెళ్లి సీఐ గారు కావాలని అడుగుతుంది. సిఐ లేరని చెప్పినా వినకుండా మొండిగా ఆయనను కలవాలని పట్టుబడుతోంది. ఈలోపు అక్కడికి వచ్చిన ఎస్ఐ విషయం కనుక్కోగా తాను ఒకరిని హత్య చేసానని చెబుతుంది. పైగా ఆ హత్య చేసి ఆ బాడీని అడవిలో పాతి పెట్టాను అని కూడా చెప్పడంతో.. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం తాండవిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తుంటారు. కానీ, ఆ ఎస్ఐ మిగిలిన వివరాలు అడిగితే మాత్రం ఆమె చెప్పదు. దీనితో అందరికి ఇదొక పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఆమె ఈ హత్య నిజంగానే చేసిందా ! ఎవరిని హత్య చేసి ఉంటుంది ! అసలు హత్య చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది ! పైగా హత్య చేసి తానే జైలుకు వచ్చి ఈ విషయాన్నీ చెప్పడం వెనుక ఉన్న అంతరార్ధం ఏమిటి ! ఆమె లొంగిపోడానికి వచ్చిందా ! లేక అసలు ఎందుకు వచ్చింది ! ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది.

క్షణం క్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ.. ఆడియన్స్ కు ఆసక్తి కలిగించే విజువల్స్ .. తర్వాత ఏం జరుగుతుందా అని టెన్షన్ తెప్పించే సీన్స్ .. ఇలా ప్రతిదీ ఈ సినిమా చూసేందుకు కొన్ని వ్యాలిడ్ రీజన్స్ అని చెప్పి తీరాలి. ఇంతకీ అదృశ్యం సినిమాను ఎక్కడ చూడొచ్చంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో తెలుగులో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. 2022 లోనే వచ్చిన ఈ మలయాళ సినిమా సినీ విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ కు తెలుగులో లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఎవరికైనా రెండున్నర గంటల పాటు బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వడానికి ఇలాంటి సినిమాలు చాలు అనేలా.. అదృశ్యం సినిమా అందరిని ఇంప్రెస్స్ చేసేస్తోంది. ఆకాశమే నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments