OTT Suggestions- Kate Winslet Movie: OTTలో టైటానిక్ హీరోయిన్ బో*ల్డ్ మూవీ.. పక్కన ఎవ్వరూ లేకుండా చూసుకోండి!

OTTలో టైటానిక్ హీరోయిన్ బో*ల్డ్ మూవీ.. పక్కన ఎవ్వరూ లేకుండా చూసుకోండి!

OTT Suggestions- Kate Winslet: ఓటీటీలు వచ్చిన తర్వాత ఎన్నో జానర్స్ లో మూవీలు చూస్తున్నారు. కానీ, కొన్నిసార్లు బో*ల్డ్ సినిమాలు చూడాలి అంటే కాస్త జంకుతుంటారు. కానీ, టైటానికి హీరోయిన్ నటించిన ఈ మూవీ మాత్రం మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.

OTT Suggestions- Kate Winslet: ఓటీటీలు వచ్చిన తర్వాత ఎన్నో జానర్స్ లో మూవీలు చూస్తున్నారు. కానీ, కొన్నిసార్లు బో*ల్డ్ సినిమాలు చూడాలి అంటే కాస్త జంకుతుంటారు. కానీ, టైటానికి హీరోయిన్ నటించిన ఈ మూవీ మాత్రం మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.

భాషతో సంబంధం లేకుండా సినిమా లవర్స్ అంతా టైటానిక్ సినిమా చూసే ఉంటారు. ఆ మూవీ ఇప్పటికీ ఒక క్లాసిక్ అనే చెప్పాలి. ఆ మూవీలో ఉండే ఎమోషన్, లవ్, డ్రామా, రొమాన్స్ మరో సినిమాలో చూపించలేకపోయారు. టైటానిక్ లో హీరో కంటే కూడా హీరోయిన్ కేట్ కేట్ విన్స్ లెట్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆ మూవీ కోసం ఆవిడ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నటించింది. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ఆ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కేట్ విన్స్ లెట్ టైటానిక్ మూవీకి మించి యాక్టింగ్ తో మెప్పించిన ఒక బో*ల్డ్ మూవీ ఉంది. ఆ సినిమా గురించి తెలియక చాలా మంది ఇప్పటి వరకు దానిని చూడలేదు.

కేట్ విన్స్ లెట్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎవరికీ అనుమానాలు లేవు. ఆమె నటనకు యావత్ ప్రపంచమే ఫిదా అయిపోయింది. అందుకే టైటానిక్ సినిమా ఇప్పటికీ క్లాసిక్ గా కొనసాగుతోంది. అయితే అంతకు మించిన అద్భుతమైన మూవీలో కేట్ విన్స్ లెట్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ మూవీలో ఈమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సెంటర్ స్టోరీ కేట్ విన్స్ లెట్ పాత్రే. ఆ మూవీ మరేదో కాదు.. 2008లో విడుదలైన “ది రీడర్”. ఈ మూవీకి కేట్ విన్స్ లెట్ కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. నిజానికి ఆస్కార్ కూడా ఆమె యాక్టింగ్ తక్కువే అనిపిస్తుంది.

ది రీడర్ మూవీలో టైటానిక్ తరహాలోనే ఒక గొప్ప ఎమోషన్ ఉంటుంది. ఒక గొప్ప ప్రేమ ఉంటుంది. ఒక గొప్ప డ్రామా ఉంటుంది. మీరు సీనిమాని చూస్తూ వేరే ప్రపంచానికి వెళ్లిపోతారు. అలాగే టైటానిక్ కి మించిన రొ*మాన్స్ కూడా ఉంటుంది. తనకన్నా చిన్నవాడు అయిన లా స్టూడెంట్ తో కేట్ విన్స్ లెట్ ప్రేమలో పడుతుంది. అతనితో తెలియకుండానే రిలేషన్ కి వెళ్లిపోతుంది. వాళ్లు శారీ*రకంగా కూడా దగ్గరవుతారు. అప్పుడు ఆమెకు అది తప్పు అనిపించదు. కానీ, ఆ తర్వాత అదే ఆమెకు శాపంగా మారుతుంది. ఆ కుర్రాడి కుటుంబం మొత్తం ఆమెను దోషిగా చూస్తుంది. అంతేకాకుండా ఆమెపై కొన్ని కేసులు వచ్చి పడతాయి.

అసలు కేట్ విన్స్ లెట్ ఆ కుర్రాడికి ఎలా దగ్గరైంది? వారి మధ్య ఆ బంధం ఎలా ఏర్పడింది? అసలు హీరోయిన్ పై వచ్చిన అభియోగాలు ఏంటి? వాటిని ఆమె అంగీకరిస్తుందా? ఆ కుర్రాడికి దూరంగా ఉంటుందా? అనేదే కథ. క్లయిమ్యాక్స్ మాత్రం గుండెలు పిండేస్తుంది. అయితే ఈ ది రీడర్ మూవీ ‘లైన్స్ గేట్ ఓటీటీ’లో అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వ్యూ ఆన్ రెంట్ బేసిస్ లో రూ.119కు అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ఎంతో ఎమోషనల్ గా ఉన్నా కూడా ఒంటరిగా చూస్తేనే మంచిది. పక్కన ఎవరున్నా మీరు దొరికిపోతారు.

Show comments