OTT Suggestions: OTTలో ఆస్కార్ విన్నింగ్ చిత్రం.. ఒక యువతి జీవితంలో ఇన్ని మలుపులా?

OTTలో ఆస్కార్ విన్నింగ్ చిత్రం.. ఒక యువతి జీవితంలో ఇన్ని మలుపులా?

OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం మన మనస్సులను దోచుకుంటాయి. అలాంటి వాటిల్లో ఈ మూవీ కూడా ఒకటి. పైగా ఇటీవల ఈ మూవీకి ఆస్కార్ కూడా వచ్చింది.

OTT Suggestions: ఓటీటీల్లో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం మన మనస్సులను దోచుకుంటాయి. అలాంటి వాటిల్లో ఈ మూవీ కూడా ఒకటి. పైగా ఇటీవల ఈ మూవీకి ఆస్కార్ కూడా వచ్చింది.

ఓటీటీలో ఎన్ని చిత్రాలు ఉన్నా.. అన్నీ మంచి సినిమా అనుభూతిని ఇవ్వలేవు. కొన్ని నటన పరంగా మెప్పిస్తే.. ఇంకొన్ని టేకింగ్ అనో.. మరికొన్ని యాక్షన్ సీక్వెన్స్ అనో ఆకట్టుకుంటాయి. కానీ, చాలా అరుదుగా అన్ని అంశాల్లో ఆసక్తి రేకెత్తించే సినిమాలు ఉంటాయి. యాక్షన్, యాక్టింగ్, టేకింగ్, విజువల్స్, కాస్టూమ్స్ అన్నింటి విభాగాల్లో ఈ చిత్రం అలరిస్తుంది. అద్భుతమైన చిత్రాల జాబితాలో ఈ మూవీ కూడా ఒకటి. ఇటీవల ఈ చిత్రానికి ఆస్కార్ కూడా వచ్చింది. ఇందులో హీరోయిన్ యాక్టింగ్ కి ఉత్తమ నటి ఆస్కార్ అవార్డు దక్కింది. మరి.. ఆ సినిమా ఏది? ఆ సినిమా కథ ఏంటి? అసలు ఆ మూవీ చూసేందుకు ఎంత వర్త్ అనే విషయాలు చూద్దాం.

ఇంత హైప్ ఇచ్చింది.. ఇస్తోంది.. పూర్ థింగ్స్ అనే చిత్రం గురించి. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి గాను ఎమ్మా స్టోన్ కు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు దక్కింది. ఇది ఒక ఫిక్షనల్ సైంటిఫిక్ డ్రామా చిత్రం. ఈ పూర్ థింగ్స్ చిత్రాన్ని 1992లో వచ్చిన నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి యోర్గోస్ లాంథిమోస్ డైరక్షన్ వహించాడు. ఈ చిత్రంలో మేజర్ క్రెడిట్ మొత్తం ఎమ్మా స్టోన్ కే దక్కుతుంది. బెల్లా బక్సటర్ క్యారెక్టర్ లో జీవించేసింది. ఒక ఆర్టిస్ట్ అన్ని వేరియేషన్స్, షేడ్స్, ట్విస్టులు, ఎమోషన్స్ కలిగిన పాత్రను చేయడం అంటే దాదాపుగా సాహసం అనే చెప్పాలి. ఆమె ఆ పాత్రలో జీవించడమే కాకుండా.. ఉత్తమ నటిగా ఆస్కార్ కూడా అందుకుంది.

ఇంక ఈ సినిమా స్టోరీలైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక మహిళకు చిన్న పాప బ్రెయిన్ ఇంప్లాట్ చేయడం అనేది చాలా డిఫరెంట్ పాయింట్. యువతి శరీరంతో పసికందు చేష్టలు చేస్తూ బెల్లా బక్సటర్ ఉంటుంది. అలాంటి సన్నివేశాల్లో పూర్తి అమాయకంగా, కల్మషంలేని పసిపాపలా ఎమోషన్స్ పలికించడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఎమ్మా స్టోన్ మాత్రం దానిని సుసాధ్యం చేసి చూపించింది. ఈ మూవీ 2023 డిసెంబర్ 8న లిమిటెడ్ లో థియేటర్లలో విడుదల చేశారు. ఆ తర్వాత జనవరి 19, 2024న వైడ్ రేంజ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 7వ తేదీనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆస్కార్ వచ్చిన తర్వాత అందరూ ఈ సినిమా గురించే వెతుకులాట మొదలు పెట్టారు. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.1 రేటింగ్ కూడా ఉంది.

కథ ఏంటంటే?:

ఈ పూర్ థింగ్స్ కథ విషయానికి వస్తే.. మ్యాక్స్ మెక్కాండల్స్ ఒక సర్జన్ కి అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. అతను గాడ్ విన్ వార్డ్ కు చెందిన బెల్లా అనే యువతితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. ఆ విషయం చెప్పగానే బెల్లా బ్రిడ్జ్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు బెల్లాకి ఆమె కడుపులో ఉన్న బిడ్డ బ్రెయిన్ ని ఇంప్లాంట్ చేస్తారు. ఆ తర్వతా ఆమెకు బెల్లా బక్సటర్ అనే పేరు పెడతారు. అయితే శరీరం మహిళదే అయినా.. తెలివితేటలు మాత్రం పసికందువి. ఆమెను చిన్న పాపలాగానే పెంచుతారు. ఆ తర్వాత ఆమె తన శరీరంలో మార్పులు, శారీరక వాంఛలు తెలుసుకుంటుంది. ఆమెకు నచ్చిన వారితో శృంగారం చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆమెను వేరే వాళ్లకి అమ్మకం పెడతారు. ఒక షిప్ వెళ్తున్నప్పుడు వారి వద్ద ఉన్న డబ్బులు అయపోయి బతుకుతెరువు కోసం బెల్లా బ్రోతల్ హౌస్ లో చేరుతుంది. అలా తన లైఫ్ చాలానే మలుపులు తిరుగుతుంది. ఇంకా ఈ పూర్ థింగ్స్ సినిమాలో చాలానే ట్విస్టులు, మలుపులు ఉన్నాయి. అసలు కథ కూడా చాలానే ఉంది.

Show comments