Onion Prices Are Increasing: నెలలో 50 శాతం పెరిగిన ఉల్లి ధరలు.. మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తాయా?

నెలలో 50 శాతం పెరిగిన ఉల్లి ధరలు.. మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తాయా?

కాగా, ఉల్లి ధరలు పెరగటానికి డిమాండ్‌ అండ్‌ సప్లై థియరీ కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్‌కు సంబంధించిన పంట మార్కెట్‌లోకి వచ్చేది.

కాగా, ఉల్లి ధరలు పెరగటానికి డిమాండ్‌ అండ్‌ సప్లై థియరీ కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్‌కు సంబంధించిన పంట మార్కెట్‌లోకి వచ్చేది.

రెండు నెలల క్రితం వరకు టమాటా ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. కిలో టమాటా ధర 300 రూపాయలు పలికింది. పేద, మధ్య తరగతి ప్రజలు టమాటా కొనడమే మానేసే పరిస్థితి వచ్చింది. తర్వాత ఒక్కసారిగా టమాటా ధరలు పడిపోయాయి. కిలో 10కి కూడా వచ్చింది. అయితే, ఇప్పుడు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పించడానికి సిద్ధమయింది. ఉల్లి ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు 50 శాతం పెరిగాయి.

జులై నుంచి అక్టోబర్‌ 19 వరకు ఉన్న ఉల్లి ధరల్ని.. ఇప్పటి ఉల్లి ధరల్ని పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఉల్లి ధర 2023 జులై నెలలో కిలో 24 రూపాయలు ఉండింది. అక్టోబర్‌ 19 నాటికి 35 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు ఉల్లి ధర దాదాపు 40 పైనే ఉంది. మార్కెట్లలో కూడా ఉల్లి ధరలు వారం రోజుల్లో 30 శాతం పెరిగాయి. గత వారం క్వింటాల్‌ ఉల్లి ధర 2500 ఉండింది. ఇప్పుడు 3250కి చేరింది. ఉల్లి ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, ఉల్లి ధరలు పెరగటానికి డిమాండ్‌ అండ్‌ సప్లై థియరీ కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్‌కు సంబంధించిన పంట మార్కెట్‌లోకి వచ్చేది. కానీ, ఈ సారి అలా జరగలేదు. ఖరీఫ్‌ పంట చేతికి రావటానికి ఆలస్యం అయింది. ఇందుకు కారణం మహారాష్ట్రలో రుతుపవనాలు ఆలస్యంగా, అసమానంగా ఉండటం. అంతేకాదు! కర్ణాటక నుంచి కూడా ఉల్లి ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో ఉల్లి లభ్యత బాగా తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి, ఉల్లి ధరలు బాగా పెరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments