Ratan Tata Confronted Gangster: 200 మంది గూండాలను పరుగులు పెట్టించిన రతన్ టాటా.. ఒక్కడే పోరాడి

Ratan Tata: 200 మంది గూండాలను పరుగులు పెట్టించిన రతన్ టాటా.. ఒక్కడే పోరాడి

విశ్వసనీయతకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న టాటా సంస్థల ఛైర్మన్ రతన్ టాటాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

విశ్వసనీయతకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న టాటా సంస్థల ఛైర్మన్ రతన్ టాటాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా టాటా అన్న పేరు విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచింది. అంతర్జాతీయంగా టాటా బ్రాండ్ కున్న గుర్తింపు, ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఉప్పు మొదలు ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ సంస్థ.. టాప్ ఎమ్మెన్సీగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాల్లో టాటా కంపెనీలు ఉన్నాయి. సుమారు 10 లక్షల మందికి పైగా వీటిల్లో పని చేస్తున్నారు. మన దేశంలోనే కాక.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది.

టాటా కంపెనీ ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వెనక రతన్ టాటా కృషి వెలకట్టలేనిది. లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా.. ఆయనలో గర్వం ఏ కోశానా కనపడదు. అందుకే ఆయన అందరికి ఇష్టుడు అయ్యాడు. సమాజం ముందు.. తర్వాతే నేను అని ఆలోచిస్తారు రతన్ టాటా. అందుకే దేశంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవిస్తే.. నేనున్నాంటూ ముందుకు వస్తారు రతన్ టాటా.

వేల కోట్ల రూపాయలను సమాజ సేవ కోసం వినియోగిస్తుంటారు. దాతృత్వంలో ఆయనని కలియుగ కర్ణుడిగా వర్ణిస్తారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రతన్ టాటా. డిసెంబర్ 28న అనగా గురువారం నాడు ఆయన బర్త్ డే. 80 వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రతన్ టాటా బర్త్ డే సందర్భంగా ఆయన గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

200 మంది గూండాలతో ఫైట్..

రతన్ టాటా వ్యాపారంలోకి ప్రవేశించిన తొలి నాళ్లల్లో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనను వ్యాపారరంగంలో ఉంచకూడదని భావించిన వాళ్లు.. రతన్ టాటాను తొక్కేయడానికి అనేక ప్రయత్నాలు కూడా చేశారట. ఈ క్రమంలో ఓ సారి రతన్ టాటా ఓ గ్యాంగ్ స్టర్ తో తలపడాల్సి వచ్చింది. సుమారు 43 సంవత్సరాల క్రితం అనగా 1980లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఏడాదే రతన్ టాటా.. టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 15 రోజుల వ్యవధిలోనే ఆయన ఓ గ్యాంగ్ స్టర్ కు వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చింది.

అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో ఓ గ్యాంగ్ స్టర్ రతన్ టాటాను బెదిరించడం కోసం అసంతృప్తితో ఉన్న కొందరు కార్మికులను రెచ్చగొట్టి.. గొడవలు చేయాలని భావించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ఆ గ్యాంగ్ స్టర్ తన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్ లోని 4 వేల మంది ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. సిబ్బంది ఎవ్వరూ విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని ఉ ద్యోగులకు వార్నింగ్ ఇచ్చాడు.

దాంతో భయపడ్డ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. విషయం తెలుసుకున్న రతన్ టాటా రంగంలోకి దిగారు. గ్యాంగ్ స్టర్, అతడి 200 మంది గూండాలను ఆయన ఒక్కడే ఎదుర్కొన్నారు. సమస్య సద్దుమణిగిన తర్వాత కూడా రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్‌లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. సినిమాల్లో జరిగే ఇలాంటి సీన్ రతన్ టాటా రియల్ లైఫ్ లో జరిగడం.. ఆయన వారిని ధైర్యంగా ఎదుర్కొవడం అప్పట్లో సంచలనంగా మారింది.

Show comments