Nayakudu OTT Release: ఓటిటిలోకి బ్లాక్ బస్టర్ 'నాయకుడు'! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..

ఓటిటిలోకి బ్లాక్ బస్టర్ ‘నాయకుడు’! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..

  • Author ajaykrishna Published - 04:03 PM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 04:03 PM, Tue - 18 July 23
ఓటిటిలోకి బ్లాక్ బస్టర్ ‘నాయకుడు’! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..

కంటెంట్ బాగుంటే సినిమాలను భాషాబేధం లేకుండా ఆదరిస్తారు సినీ ప్రేక్షకులు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఇప్పటిదాకా ఎన్నో తమిళ, మలయాళం, కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే బాటలో రీసెంట్ తమిళ బ్లాక్ బస్టర్ ‘మామన్నన్’ కూడా తెలుగులో విడుదలైంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తిసురేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను.. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో జులై 14న.. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేశాయి. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని కర్ణన్ ఫేమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కించారు.

తమిళంలో జూన్ 29న విడుదలైన మామన్నన్.. సంచలన విజయం సాధించింది. సూపర్ స్టార్ రజనీ, విశ్వనటుడు కమల్ హాసన్ లాంటి హేమహేమీల చేత ఈ సినిమా ప్రశంశలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యేసరికి.. మామన్నన్ మూవీని నాయకుడుగా రిలీజ్ చేయడం వరకు బాగానే ఉంది. డబ్బింగ్ మూవీ అయినా.. కంటెంట్ నచ్చి జనాలు మెల్లగా థియేటర్స్ కి వెళ్లడం స్టార్ట్ చేశారు. కానీ.. ఇంతలోనే ఊహించని విధంగా.. ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన సైతం రావడం గమనార్హం.

అవును.. నాయకుడు సినిమా తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో డబ్బింగ్ సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నిరాశను వ్యక్తపరుస్తున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్.. నాయకుడు స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. కాగా.. ఈ నెల 27 నుండి మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. పైగా.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో నాయకుడు అందుబాటులోకి రాబోతుంది. అయితే.. ఈ సినిమా తెలుగులో విడుదలై ఇంకా నాలుగు రోజులు కూడా కాలేదు. అంతలోనే ఓటిటికి రావడమేంటని నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి థియేటర్స్ లో ఎందుకు రిలీజ్ చేశారంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి నాయకుడు మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments