Naa Saami Ranga: నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ

Naa Saami Ranga Review in Telugu: నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ

Naa Saami Ranga Movie Review & Rating in Telugu: సంక్రాంతి పండుగ సందర్భంగా కింగ్‌ అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమా భారీ అంచనాల నడుము ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన నా సామిరంగ.. మరి వాటిని అందుకుందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం..

Naa Saami Ranga Movie Review & Rating in Telugu: సంక్రాంతి పండుగ సందర్భంగా కింగ్‌ అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమా భారీ అంచనాల నడుము ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన నా సామిరంగ.. మరి వాటిని అందుకుందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం..

నా సామిరంగ

20240114,
పీరియాడిక్ డ్రామా
  • నటినటులు:నాగార్జున, నరేశ్, రాజ్‌తరుణ్‌, ఆషికా రంగనాథ్, రావు రమేష్‌,
  • దర్శకత్వం:విజయ్ బిన్నీ
  • నిర్మాత:శ్రీనివాస చిట్టూరి
  • సంగీతం:కీరవాణి
  • సినిమాటోగ్రఫీ:దాశరథి శివేంద్ర

2.25

“నా సామిరంగ”.. సంక్రాంతి బరిలో చివరగా విడుదలైన చిత్రం. అక్కినేని నాగార్జున ఇమేజ్ కి సరిపడే పక్కా పండగ సినిమాగా ఈ చిత్రాన్ని యూనిట్ ప్రమోట్ చేస్తూ వచ్చింది. ప్రమోషనల్ వీడియోస్ కూడా ఇందుకు తగ్గట్టే రిలీజ్ చేశారు. దీంతో.. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి.. “నా సామిరంగ” ఈ అంచనాలను అందుకుందా? నాగార్జున ఇప్పుడైనా సాలిడ్ సక్సెస్ అందుకున్నాడా? ఇలాంటి విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 

కథ:

కోనసీమ జిల్లాలోని అంబాజీ పేట ఊరు. ఆ ఊరిలో కిష్టయ్య ఓ అనాధ. అతనిని ఓ తల్లి ఆదరించి, దగ్గరికి తీసుకుంటుంది. ఆమె చనిపోయాక ఆమె కొడుకు అంజిని కిష్టయ్య సొంత తమ్ముడిలా చూసుకుంటూ ఉంటాడు. ఇక కిష్టయ్య ఆ గ్రామంలోని వరాలుని చిన్ననాటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఇక ఈ అన్నదమ్ములకి ఆ ఊరి పెద్ద.. పెద్దయ్య మాటే  వేదవాక్కు. అయితే.. అదే గ్రామానికి చెందిన భాస్కర్ తన ప్రేమ వ్యవహారంతో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. అతన్ని కాపాడే బాధ్యత కిష్టయ్యకి అప్పగిస్తాడు పెద్దయ్య. ఈ క్రమంలో కిష్టయ్య, అంజి ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? కిష్టయ్య తన ప్రేమని దక్కించుకోవడానికి ఏర్పడ్డ అడ్డంకులు ఏమిటి? ఈ ప్రయాణంలో అంజి, క్రిష్టయ్యని టార్గెట్ చేసింది ఎవరు అన్నదే “నా సామిరంగ” కథ. 

విశ్లేషణ:

తరాలు మారుతున్నాయి. సినీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. దీనికి తగ్గట్టే మిగతా ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలు తమ వయసుకి తగ్గ కథలని, పాత్రలని ఎంచుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. కానీ.., ఒక్క తెలుగు సినిమాలో మాత్రమే ఇంకా ఎలాంటి మార్పు రాలేదు. 6 పదుల వయసు దాటిన సీనియర్ హీరోలు కూడా సగం సినిమాకి పైగా.. లవ్ ట్రాక్ తో బండి లాగిస్తాము, ప్రేక్షకులు చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తారు అన్న భ్రమలోనే ఉండిపోయారు. ఇందుకు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఏమి అతీతం కాదు. ముఖ్యంగా “నా సామిరంగ” సినిమాని పండగ సినిమాలా ప్రమోట్ చేసి, తీరా సినిమాని లవ్ స్టోరీతో నింపేశారు. ఆ లవ్ స్టోరీలో ఏజ్ రీత్యా నాగార్జున ఇమడలేక, ప్రేక్షకులు దానికి కనెక్ట్ కాలేక.. నా “నా సామిరంగ” ట్రాక్ తప్పేసింది. 

1988లో సాగే “నా సామిరంగ” కథలో చాలానే పాత్రలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కోసం, స్టోరీ ప్రోగ్రెసివ్ కోసం, విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎస్టాబ్లిష్ కోసం దర్శకుడు చాలానే సమయం తీసుకున్నాడు. కాకుంటే.., ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ రస్టిక్ గానే కాకుండా,  రియాలిటీకి దగ్గరగా ఉండటంతో “నా సామిరంగ” టేకాఫ్ సరిగ్గానే సాగిందన్న ఫీల్ కలుగుతుంది. కాకుంటే.. ఎప్పుడైతే  హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ ఓ చిన్న సీక్వెన్స్ గా మొదలై..  ఒక్కసారిగా మొత్తం ప్లే టైమ్ ని ఆక్యుపై చేసేసిందో అప్పుడే “నా సామిరంగ” గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నాగార్జునకి ఆ లవ్ ట్రాక్ సూట్ కాకపోవడం, వీరి లవ్ తప్ప ప్యారెలెల్ గా ఎలాంటి స్టోరీ నెరేషన్ జరగకపోవడం మరో మైనస్ గా మారింది. అయితే.. అప్పుడపుడు అండర్ ప్లేగా వచ్చి పోయే రావు రమేష్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సన్నివేశాలు కాస్త ఉపశమనం ఇస్తాయి. అయితే.. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంతగా పేలకపోవడంతో  “నా సామిరంగ” ఫస్ట్ ఆఫ్ సాదాసీదాగా ముగిసిన ఫీల్ వస్తుంది. 

ఫస్ట్ హాఫ్ అంతా సాగిన లవ్ ట్రాక్.. సెకండ్ హాఫ్ లో కూడా కంటిన్యూ కావడం, మధ్యలో ఫిల్లింగ్ కోసంలా తీసుకొచ్చిన ఊరి గొడవల యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంతగా ఆకట్టుకోకపోవడంతో “నా సామిరంగ” మూవీతో ఆడియన్ డిస్ కనెక్ట్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది.  సరిగ్గా ఇక్కడే అల్లరి నరేష్ మ్యాజిక్ చేసేశాడు. ఓ 15 నిమిషాల పాటు.. కథలోని ఎమోషన్స్ అన్నిటినీ అంజి పాత్రతో పీక్స్ కి తీసుకెళ్లిపోతాడు. అప్పటి వరకు ఎలాంటి స్క్రీన్ స్పేస్ దొరకని క్యారెక్టర్స్ కూడా.. అంజి కారణంగా అప్పుడే హైలెట్ అవుతూ ఉంటాయి. ఇలా ప్రీ క్లైమాక్స్ మొత్తం ఒంటి చేత్తో మోసిన అల్లరి నరేష్ సినిమాపై ఆశలు పుట్టిస్తాడు. కానీ.., సాధారణ తెలుగు సినిమా క్లైమాక్స్ లానే “నా సామిరంగ” ముగియడంతో అల్లరి నరేష్ కష్టానికి అర్థం లేకుండా పోయింది. 

నటీనటుల పనితీరు: 

“నా సామిరంగ”లో గొప్పగా చెప్పుకోవాల్సింది అల్లరి నరేష్ యాక్టింగ్, ఎనర్జీ గురించే. నాగార్జున లాంటి సీనియర్ హీరో పక్కనే ఉన్నా, అల్లరోడు మొత్తం చూపులను తనవైపు తిప్పేకునేలా చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో నరేష్ నటన అన్ మ్యాచబుల్. ఒక్క నరేష్  మినహా.. మిగతా ఆర్టిస్ట్ లు ఎవ్వరూ  ఓ పరిధి దాటి మెరవలేకపోయారు. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఈ లిస్ట్ లో హీరో అక్కినేని నాగార్జున కూడా ఉండటం. యాక్టింగ్, లుక్స్, ఎనర్జీ పరంగా  నాగ్ కెరీర్ లోనే ఇది అత్యంత లో ఎఫర్ట్స్ పెట్టిన చిత్రంగా చెప్పుకోవచ్చు. దీనికి దర్శకుడు బాధ్యత ఎంతవరకు అన్నది వారికే తెలియాలి. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందంతో ఆకట్టుకుంది. 

టెక్నికల్ విభాగం:  

1988లో సాగే “నా సామిరంగ”లో అన్నీ కలర్ ఫుల్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా ఆర్ట్ వర్క్ హైలెట్ అయ్యిందే లేదు. ఇలా పీరియాడిక్ డ్రామాలో మినిమమ్ లెవల్ వరల్డ్ బిల్డింగ్ లేకుండా అద్భుతాలు ఆశించలేము. ఇక దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీలో అంతగా మెరుపులు లేకపోగా, కీరవాణి మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది. చివరిగా  విజయ్ బిన్నీ డైరెక్షన్ లో అనుభవలేమి కొట్టొచిన్నట్టు కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నాగార్జున నుండి నటన రాబట్టుకోవడంలో విజయ్ పూర్తిగా విఫలం అయ్యాడు. 

ప్లస్ లు: 

  • అల్లరి నరేష్ నటన
  • హీరోయిన్ అందం
  • ప్రీ క్లైమాక్స్

మైనస్ లు: 

  • నాగార్జునకి సరిపడని క్యారెక్టర్
  • లవ్ స్టోరీ
  • వీక్ క్లైమాక్స్
  • పాటలు

చివరి మాట:  “నా సామిరంగ”: నాగ్ కి సెట్ కాలేదు

రేటింగ్: 2.25/5

ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
Show comments