విషాదం: ఇల్లు కూలి తల్లితో సహా ముగ్గురు పిల్లలు మృతి!

విషాదం: ఇల్లు కూలి తల్లితో సహా ముగ్గురు పిల్లలు మృతి!

కొన్ని కొన్ని ఘటనలు చూసినా ,విన్నా మన హృదయాలు చలించిపోతాయి. అలాంటి ఘటనే ఒకటి ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఇళ్లు కూలిన ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు కుమార్తెలు మరణించారు. ఈ పిల్లల వయస్సు ఐదేళ్ల లోపే ఉంది.

కొన్ని కొన్ని ఘటనలు చూసినా ,విన్నా మన హృదయాలు చలించిపోతాయి. అలాంటి ఘటనే ఒకటి ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఇళ్లు కూలిన ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు కుమార్తెలు మరణించారు. ఈ పిల్లల వయస్సు ఐదేళ్ల లోపే ఉంది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. కొన్ని మానవ చర్యల కారణంగా జరిగేవి అయితే మరికొన్ని మాత్రం ప్రకృతి విపత్తుల కారణంగా సంభవిస్తుంటాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, వరదలు వంటి విపత్తుల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు నిద్రలో ఉండగానే తాము ఎలా చనిపోయో తెలియకుండానే మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. తాజాగా ఓ ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇళ్లు కూలిన ఘటన తల్లితో సహా ముగ్గురు పిల్లలు మృతిచెందారు. మరి.. ఆ ఘటన ఎక్కడ జరిగింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జమ్మూ కశ్మీర్‌లో రియాజీ జిల్లాలోని కుందర్‌ధన్ మోహ్రా గ్రామంలో ఓ పాత ఇళ్లు ఆదివారం కూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్న తల్లి, ఆమె ముగ్గురు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఫల్లా అఖ్తర్ (30) అనే మహిళ కుమార్తెలు నసీమా (5), సఫీనా కౌసర్ (3), సమ్రీన్ కౌసర్ (2)లతో మోహ్రా గ్రామంలో నివాసం ఉంటుంది. స్థానికంగా పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంది. గత కొన్నిరోజుల జమ్మూకశ్మీర్ ప్రాంతంలో వానాలు కురుస్తుండంతో వారు ఇంట్లోనే ఉండిపోయారు.

ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వీరి ఇళ్లు ఉన్నట్లు ఉండి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అందులోనే ఉన్నా..ఫల్లా అఖ్తర్ తో సహా ఆమె ముగ్గురు బిడ్డలు చనిపోయారు. ఈ ఘటనలో అదే కుటుంబంలోని కౌల్ , బనో బేగం అనే వృద్ధ దంపతులు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టిన రెస్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గత మూడు రోజులుగా కశ్మీర్‌ ప్రాంతంలో భారీ వర్షాలు, మంచు కురుస్తున్నా. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటం, హిమపాతం సంభవించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Show comments