Mohammed Shami: ఫైనల్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి ప్రధాని మోడీ రావడంపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

Mohammed Shami: ఫైనల్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి ప్రధాని మోడీ రావడంపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ.. తాజాగా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వచ్చి ఆటగాళ్లను ఓదార్చడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంతకీ షమీ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ.. తాజాగా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వచ్చి ఆటగాళ్లను ఓదార్చడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంతకీ షమీ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి భారత క్రికెట్‌ అభిమానులను ఎంతో బాధించింది. ఆ ఓటమి నుంచి బయటపడేందుకు క్రికెట్‌ అభిమానులతో పాటు, టీమిండియా క్రికెటర్లు సైతం చాలా టైమ్‌ తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే.. భారత సీనియర్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, షమీ, కేఎల్‌ రాహుల్‌ ఆ ఓటమి నుంచి బయటపడి.. భవిష్యత్తు సిరీస్‌ల కోసం రెడీ అవుతున్నారు. అయితే.. తాజాగా ఓ ఫైనల్‌ ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి పరిస్థితి ఉంది. ఆటగాళ్ల మానసిక స్థితి ఏంటి? ఫైనల్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి ప్రధాని నరేంద్ర మోడీ రావడంపై స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

షమీ మాట్లాడుతూ.. ‘ఫైనల్‌ ఓటమి తర్వాత.. జట్టులోని ఆటగాళ్లంతా మౌనంగా ఉండిపోయారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. రూమ్‌ అంతా మౌనం ఆవహించింది. ఎవరూ కూడా కనీసం భోజనం కూడా చేయలేదు. అదే సమయంలో సడన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చారు. ఆయన వస్తున్న విషయం ఎవరికీ తెలియదు. దీంతో.. ఆయన అలా రాగానే అంతా ఆశ్చర్యపోయాం. అయితే.. మోదీ జీ అలా వచ్చి మాట్లాడం మాకు ఎంతో కాస్త స్వాంతన ఇచ్చింది. ఆ సమయంలో అది చాలా ముఖ్యం.’ అని షమీ పేర్కొన్నాడు. ఆ సమయంలో మోదీ షమీని దగ్గరికి తీసుకోని మరీ ఓదార్చిన విషయం తెలిసిందే.

కాగా.. వరల్డ్‌ కప్‌ మొత్తం అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. వరుసగా పది మ్యాచ్‌లు గెలుస్తూ.. ఫైనల్‌ వరకు దూసుకొచ్చిన టీమిండియా.. ఈ సారి ఎలాగైన కప్పు గెలుస్తుందని అంతా భావించారు. కానీ, దురదృష్టవశాత్తు.. ఫైనల్లో టాస్‌ ఓడిపోవడం, డ్యూ రావడంతో మ్యాచ్‌ చేజారిపోయింది. వరల్డ్‌ కప్‌ గెలవాలని కలలు కన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓటమి తర్వాత కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి.. చాలా మంది భారత క్రికెట్‌ అభిమానులు ఏడ్చేశారు. అలాగే స్టార్‌ బ్యాటర్‌, వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్‌ కోహ్లీ సైతం కంటతడి పెట్టుకోవడం అందర్ని కలిచివేసింది. అలాంటి సమయంలో ఏకంగా దేశ ప్రధాని వచ్చి తమను ఓదార్చడం ఎంతో ఊరటనిచ్చిందని షమీ చెప్పుకోచ్చాడు. మరి షమీ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments