ఓడింది ముంబై ఇండియన్స్‌ అయినా.. డేంజర్‌ బెల్స్‌ మాత్రం టీమిండియాకే!

ఓడింది ముంబై ఇండియన్స్‌ అయినా.. డేంజర్‌ బెల్స్‌ మాత్రం టీమిండియాకే!

Mitchell Starc, T20 World Cup 2024, MI vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడం.. టీమిండియాను కలవరపెడుతోంది. అది ఎందుకో తెలియాలంటే.. ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి.

Mitchell Starc, T20 World Cup 2024, MI vs KKR: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడం.. టీమిండియాను కలవరపెడుతోంది. అది ఎందుకో తెలియాలంటే.. ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి.

ఐపీఎల్‌ 2024లో భాగంగా శుక్రవారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత ముంబైని వాంఖడే స్టేడియంలో ఓడించింది కేకేఆర్‌. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది ముంబై ఇండియన్స్‌ అయినప్పటికీ.. డేంజర్‌ బెల్స్‌ మాత్రం టీమిండియాకే మోగుతున్నాయని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ముంబై ఓడిపోతే.. టీమిండియాకు ఎలా నష్టం అనే డౌట్‌ రావచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ చెత్త ఆటతో టీమిండియా కొత్త సమస్య తెచ్చిపెట్టింది ముంబై ఇండియన్స్‌. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ 4 వికెట్లతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కంటే ముందు స్టార్క్‌ చెత్త ఫామ్‌లో ఉన్నాడు. 9 మ్యాచ్‌ల్లో 11కి పైగా ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీసి.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, ముంబై ఇండియన్స్‌ బ్యాటర్ల చెత్త ఆటతో.. మిచెల్‌ స్టార్క్‌ తన పాత​ ఫామ్‌ను అందుకున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్‌లో స్టార్క్‌ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా టీ20 వలర్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. మొన్నటి వరకు చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలవుతూ వచ్చిన.. స్టార్క్‌ ముంబైతో మ్యాచ్‌లో 4 వికెట్ల పడగొట్టడంతో పాటు వరల్డ్‌ కప్‌ కంటే ముందు మంచి కాన్ఫిడెన్స్‌ పొందాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఉంటుందనే విషయం తెలిసిందే. అసలే ఐసీసీ ఈవెంట్స్‌లో ఆస్ట్రేలియా చాలా డేంజరస్‌గా ఆడుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి టీమ్‌లో సభ్యుడిగా ఉన్న స్టార్క్‌ను ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ఫామ్‌లోకి తెచ్చింది. అసలే.. టీమిండియాలోని స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతారు. ఇక స్టోగా ఉండే వెస్టిండీస్‌ పిచ్‌లపై స్టార్క్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం. అలాంటిది ఫామ్‌లో ఉన్న స్టార్క్‌ను ఆడటం అంటే కత్తి మీద సామే. మరి ఫామ్‌లో లేకుండా ఇబ్బంది పడుతున్న స్టార్క్‌ను తమ చెత్త బ్యాటింగ్‌తో ఫామ్‌లోకి తెచ్చి.. టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా సమస్య సృష్టించిన ముంబై ఇండియన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments