MI vs LSG- Nehal Wadhera Innings Against Lucknow: MI పరువు కాపాడిన నేహాల్ వధేరా.. సీనియర్లు అంతా ఫెయిలైనా కూడా..!

MI పరువు కాపాడిన నేహాల్ వధేరా.. సీనియర్లు అంతా ఫెయిలైనా కూడా..!

MI vs LSG- Nehal Wadhera: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ దారుణమైన ఫామ్ కొనసాగుతూనే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముంబయి బ్యాటింగ్ యూనిట్ దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది.

MI vs LSG- Nehal Wadhera: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ దారుణమైన ఫామ్ కొనసాగుతూనే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముంబయి బ్యాటింగ్ యూనిట్ దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎప్పుడు ఎలాంటి మ్యాచ్ ఫలితం వస్తుందో ఎవ్వరూ చెప్పడాని లేదు. ఒక్కోసారి నామమాత్రపు జట్టు అనుకున్నది విజృంభించవచ్చు. ఒక్కోసారి తోపు టీమ్ అనుకున్నది నామమాత్రపు ప్రదర్శన చేయచ్చు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ముంబయి జట్టు పరిస్థితి కూడా అలాగే మారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు మొదటి నుంచి ముంబయి బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు అంతా వచ్చినవాళ్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుతున్నారు. అలాంటి సమయంలో కుర్రాడు నేహాల్ వధేరా ముంబయి జట్టు పరువు కాపాడాడు.

ముంబయి ఇండియన్స్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ స్టార్ట్ చేసింది మొదలు వికెట్లు పడుతూనే ఉన్నాయి. రోహిత్ శర్మ మొదలు.. ప్రతి ఒక్కరు వస్తున్నారు వెళ్తున్నారు. టాపార్డర్ లో ఇషాన్ కిషన్(32) మాత్రమే పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(10), తిలక్ వర్మ(7), కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డక్ అయ్యాడు. అప్పటివరకు ముంబయి ఇండియన్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అలాంటి సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన నేహాల్ వధేరా అద్భుతంగా రాణించాడు. వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో ఆ ఫ్లోకి బ్రోకులు వేశాడు. ఆటను నిలకడగా ముందుకు సాగించాడు.

నేహాల్ వధేరా 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 46 పరుగులు చేశాడు. తృటిలో తన అర్ధ శతకాన్ని మిస్ చేసుకున్నాడు. నిజానికి అర్ధ శతకం మిస్ అయినా కూడా నేహాల్ వధేరా ఇన్నింగ్స్ శతకంతో సమానం అనే చెప్పాలి. ఎందుకంటే ముంబయి జట్టు 120 పరుగులకే ఆలౌట్ అవుతుంది అనుకునే తరుణంలో స్కోర్ బోర్డును వంద దాటించేశాడు. మెచ్యూర్డ్ షాట్స్ ఆడుతూ.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు సవాలు విసిరాడు. నేహాల్ తో కలిసి టిమ్ డేవిడ్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఏకంగా 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఈ మ్యాచ్ మొత్తంలో ఇషాన్ కిషన్(32), నేహాల్(46), టిమ్ డేవిడ్(35*), సూర్య కుమార్ యాదవ్(10) మినహా మరెవరూ రెండెంకల స్కోర్ చేయలేదు. మొత్తానికి ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ చూస్తే.. మోహ్సిన్ ఖాన్ కు 2 వికెట్లు, మార్కస్ స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, యమాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ లకు తలో వికెట్ దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి ఇండియన్స్ అత్యంత దారుణమైన ఫామ్ అయితే కొనసాగుతూనే ఉంది. అత్యల్ప టార్గెట్ ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనే ప్రశ్న కూడా ఉంది. కాకపోతే బాల్ తో మ్యాజిక్ చేస్తారు అంటూ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి.. ముంబయి ఇండియన్స్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments