IPL 2024: లక్నోకు సూపర్ గుడ్ న్యూస్.. ముంబైకి ఇక కష్టమే!

IPL 2024: లక్నోకు సూపర్ గుడ్ న్యూస్.. ముంబైకి ఇక కష్టమే!

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ను ఢీకొనేందుకు సిద్దమైంది లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఈ మ్యాచ్ కు ముందు లక్నోకు సూపర్ గుడ్ న్యూస్ అందింది.

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ను ఢీకొనేందుకు సిద్దమైంది లక్నో సూపర్ జెయింట్స్. అయితే ఈ మ్యాచ్ కు ముందు లక్నోకు సూపర్ గుడ్ న్యూస్ అందింది.

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ ముంబైకి చావోరేవో లాంటింది. ఈ మ్యాచ్ లో గనక ఎంఐ టీమ్ ఓడిపోతే.. దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు మూసుకుపోయినట్లే. ఇలాంటి మ్యాచ్ కు ముందు లక్నోకు సూపర్ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?

ఈ ఐపీఎల్ సీజన్ లో లక్నో టీమ్ నిలకడగా రాణిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలతో 5వ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వరుసగా రెండు పరాజయాలు చవి చూసిన లక్నో.. తన తర్వాతి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఢీకొనబోతోంది. ఈ నేపథ్యంలో గాయం కారణంగా దూరమైన లక్నో స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ తిరిగి జట్టులో చేరాడు. ఇంజ్యూరీతో ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరమైన మయాంక్.. పూర్తి ఫిట్ నెస్ సాధించాడని, ముంబైతో జరిగే మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉందని ఆ జట్టు బౌలింగ్ కోచ్ తెలిపాడు.

ఇది లక్నోకు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మెరుపు వేగంతో నిలకడగా గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించడంలో మయాంక్ దిట్ట అన్న విషయం మనందరికి తెలిసిందే.  ఈ ఎడిషన్ లో ఆర్సీబీపై గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి రికార్డ్ సృష్టించాడు. ఈ సీజన్ లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్ కావడం విశేషం. ఇక  ఈ సీజన్ లో కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో ప్లేస్ లో ఉంది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 3 మాత్రమే గెలిచి, ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Show comments