Pic Talk: మాయలోడు సినిమాలోని పాప.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?

మాయలోడు సినిమాలోని పాప.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?

ఎస్వీ కృష్ణా రెడ్డి- రాజేంద్ర ప్రసాద్ కాంబోలో వచ్చిన తొలి సినిమా మాయలోడు. ఈ మూవీ ఎంతో మందికి గుర్తింపునిచ్చింది. బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ వంటి కమెడియన్లు.. తమ కామెడీతో కితకితలు పెట్టించారు. ఇందులో నటించిన చిన్నారి..

ఎస్వీ కృష్ణా రెడ్డి- రాజేంద్ర ప్రసాద్ కాంబోలో వచ్చిన తొలి సినిమా మాయలోడు. ఈ మూవీ ఎంతో మందికి గుర్తింపునిచ్చింది. బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ వంటి కమెడియన్లు.. తమ కామెడీతో కితకితలు పెట్టించారు. ఇందులో నటించిన చిన్నారి..

కుటుంబ కథా చిత్రాల దర్శకుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఎస్వీ కృష్ణా రెడ్డి. రాజేంద్రుడు-గజేంద్రుడు మూవీ నుండి గత ఏడాది వచ్చిన ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు వరకు దాదాపు 45 సినిమాలను తెరకెక్కించాడు. ఎస్వీ కృష్ణా రెడ్డి కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. మల్టీ టాలెంటర్. హీరో, స్క్రీన్ రైటర్, కంపోజర్ కూడా. తాను దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ హిట్స్ ఆల్బమ్స్ అందించాడు. ఈ దర్శకుడు తొలి హీరో రాజేంద్ర ప్రసాద్. రాజేంద్రడు, గజేంద్రుడు, మాయలోడు, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు వంటి చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. ఇందులో మాయలోడు సినిమా చాలా డిఫరెంట్.

‘నేనుగానీ ఒక ఈల గానీ వేశానంటే’ మాయలోడు పాత్రలో మెరిశాడు నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్. 1993లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా చూశారు. మనీషా ఫిల్మ్ పతాకంపై కె. అచ్చిరెడ్డి, కిశోర్ రాఠీ నిర్మించారు. ఇందులో అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న సౌందర్య ..కమెడియన్ అయిన బాబు మోహన్‌తో ‘ చినుకు చినుకు అందెలతో’ అనే పాటకు స్టెప్స్ వేసి అలరించింది. మాయలోడు హిట్ మూవీగా మారడానికి ఈ పాట కూడా ఎంతో సాయపడింది. హైదరాబాద్ శ్రీనివాస థియేటర్లలో ఈ సినిమా ఏకంగా 252 రోజులు ఆడటం విశేషం. ఇందులో బ్రహ్మనందం, ఆలీ మధ్య వచ్చే డైలాగ్స్ కూడా కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఆలీకి ఫేమస్ డైలాగ్ ‘ఎంద చాట’ ఈ సినిమాలోనిదే. అలాగే బామ్మగా నటించిన నిర్మలమ్మకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమాల్లో హీరో హీరోయిన్లు కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా గుర్తుండిపోతుంటారు. వారిలో ఒకరు బేబి నికిత. మాయలోడు సినిమాలో పప్పీగా నటించింది. ఆ అమ్మాయి వచ్చాకే.. రాజేంద్ర ప్రసాద్ జీవితంలో కీలక మలుపులు చోటుచేసుకుంటాయి. మాయలోడులో పప్పీగా అలరించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూడటానికి రెండు కళ్లు చాలవు.ఇప్పుడు పెద్దదై.. తమిళ సీరియల్స్‌తో బిజీగా మారినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఆమె ఫోటోలు చూస్తే హీరోయిన్ మెటీరియల్ అనుకోవడం పక్కా. హైదరాబాద్‌లో పుట్టి పెట్టిన ఆమె 2000 తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. చదువుపై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత టీవీ తెరపైకి వెళ్లినట్లు సమాచారం. ఆమె మాయలోడు మాత్రమే కాదు. ఘటోత్కచుడు, అల్లరి మొగుడు, నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులోనే కాదు తమిళ చిత్రాల్లోనూ సందడి చేసింది.

Show comments