సితార పెద్ద హీరోయిన్ అవుతుంది.. మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సితార పెద్ద హీరోయిన్ అవుతుంది.. మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న భారీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, ట్రైలర్ భారీ విజయం సాధించాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్, మహేష్ మాట్లాడిన స్పీచ్ లతో డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ లతో యాంకర్ సుమ చేసిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూని విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. ఈ సినిమా నుంచి రిలీజైన పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో మహేష్ కూతురు సితార నటించిన సంగతి తెలిసిందే.

దీనిపై మహేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ వెళ్లి నమ్రతని అడిగి సితారతో ఓకే చెప్పించి నాకు తెలీకుండా పాటని షూట్ చేశారు. మొత్తం అయ్యాక వచ్చి చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను. సితారని చూసి గర్వపడతాను. అయితే ఈ పాట కేవలం ప్రమోషన్స్ కి మాత్రమే, సినిమాలో ఉండదు. ఈ పాట సినిమాలో ఉండదు అన్న విషయం తెలిసి సితార గొడవ పెడుతుంది, సినిమాలో ఎందుకు లేదని. భవిష్యత్తులో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుంది అని తెలిపారు. కనీసం సినిమా ఎండింగ్ లో టైటిల్స్ దగ్గర అయినా ఈ సాంగ్ వేయొచ్చు కదా అని సుమ అడిగితే మీరు లేని పోనీ సలహాలు ఇచ్చి సితార మళ్ళీ అడిగేలా చేయకండి అని సరదాగా నవ్వేశారు మహేష్.

Show comments