Lending Money vs Buying Plot: వడ్డీ వ్యాపారం, స్థలం కొనడం రెండిట్లో ఏది ఎక్కువ లాభం? ప్రాక్టికల్ లెక్కలతో సహా..

వడ్డీ వ్యాపారం, స్థలం కొనడం రెండిట్లో ఏది ఎక్కువ లాభం? ప్రాక్టికల్ లెక్కలతో సహా..

మీ దగ్గర డబ్బు ఉండి స్థలం కొనాలా? లేక వడ్డీకి తిప్పుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. డబ్బు ఉంటే వడ్డీ వ్యాపారం చేయడం లేదా ఆ డబ్బుతో స్థలం కొనడం.. ఈ రెండిటిలో దేని వల్ల ఎక్కువ లాభం వస్తుందో ఈ కథనంలో తెలుసుకోండి.

మీ దగ్గర డబ్బు ఉండి స్థలం కొనాలా? లేక వడ్డీకి తిప్పుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. డబ్బు ఉంటే వడ్డీ వ్యాపారం చేయడం లేదా ఆ డబ్బుతో స్థలం కొనడం.. ఈ రెండిటిలో దేని వల్ల ఎక్కువ లాభం వస్తుందో ఈ కథనంలో తెలుసుకోండి.

చాలా తక్కువ మంది దగ్గర దాచుకున్న డబ్బు ఉంటుంది. కొంతమంది దగ్గర పొలం అమ్ముకున్న డబ్బులు ఉంటాయి. అయితే ఈ డబ్బుని కొంతమంది వడ్డీకి ఇవ్వడం, లేదా ఏదైనా స్థలం మీద పెట్టుబడి పెట్టడం చేస్తుంటారు. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే.. మన దగ్గరున్న డబ్బుని వడ్డీకి తిప్పితే ఎక్కువ లాభమా? లేదంటే స్థలం కొంటే ఎక్కువ లాభమా? అని సందేహం ఉంటుంది. కొంతమంది అయితే వడ్డీకి తిప్పితేనే లాభం ఉంటుంది అని.. మరికొంతమంది అయితే స్థలం మీద పెట్టుబడి పెడితేనే లాభం అని ఇలా ఎవరి వెర్షన్ లో వాళ్ళు ఉంటారు. నిజానికి వడ్డీకి అప్పు ఇవ్వడం, స్థలం కొనడం.. ఈ రెండిటిలో ఏది బెస్ట్? దేనిలో ఎక్కువ లాభం ఉంటుంది అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

వడ్డీకి తిప్పితే వచ్చే లాభం:?

దారుణమైన వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. మరీ 4,5,10 రూపాయలకు ఇస్తారు. అలాంటి వాళ్ళని మినహాయిస్తే కాస్త ధర్మంగా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని పరిగణనలోకి తీసుకుందాం. ఎందుకంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపించి అసలు మొత్తం ఎగ్గొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ డబ్బులు వస్తాయో లేదో అన్న గ్యారంటీ లేదు. ఇక బాగా తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్లకి రూపాయినర వడ్డీకి అప్పు ఇస్తారు. బయట వాళ్ళకి రెండు రూపాయల వడ్డీకి ఇస్తారు. ఉదాహరణకు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకుందాం. ఆ పది లక్షలను రెండు రూపాయల వడ్డీకి ఇస్తే నెలకు 20 వేలు చొప్పున ఏడాదికి 2,40,000 వస్తాయి. ఐదేళ్ళలో 12 లక్షలు వస్తాయి. అసలు 10 లక్షలు పక్కన పెట్టినా.. దాంతో మీరు సంపాదించిన మొత్తం 12 లక్షలే. అంటే ఏడాదికి 2,40,000 రూపాయలే. ఇదే 10 లక్షలను స్థలం మీద పెట్టుబడి పెడితే ఇంతకంటే ఎక్కువ లాభం వస్తుంది. ఎలాగో ప్రాక్టికల్ గా లెక్కలతో సహా చూద్దాం. 

స్థలం కొంటే వచ్చే లాభం:

ఉదాహరణకు హైదరాబాద్ లో మహేశ్వరం ఏరియాని తీసుకుందాం. 2019లో ఇక్కడ గజం స్థలం 5,400 రూపాయలు. మీ దగ్గర పది లక్షలు ఉన్నాయనుకోండి.. ఆ పది లక్షలకు 185 గజాల స్థలం వస్తుంది. ఆ 185 గజాల స్థలం విలువ ఇప్పుడు అంటే 2024లో 27 లక్షల 50 వేలు. అంటే ఐదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన 10 లక్షల మీద 17 లక్షలు లాభం వచ్చినట్టు. అంటే ఏడాదికి 3,40,000 రూపాయలు. అంటే నెలకు 28 వేల రూపాయలు. ఇదే పది లక్షలను 2 రూపాయలకు వడ్డీకి ఇస్తే వచ్చే వడ్డీ నెలకు 20 వేలు. ఈ లెక్కన స్థలం కొంటే 8 వేలు అదనంగా లాభం ఉంటుంది. ఇప్పుడు ఇదే మహేశ్వరం ఏరియాలో మీ దగ్గరున్న పది లక్షలకి, ఇంకో 10 లక్షలు కలిపి 20 లక్షలతో స్థలం కొనాలనుకుంటే గజం 14,850 రూపాయల చొప్పున 134 గజాలు కొనుక్కోవచ్చు.

ఐదేళ్ళలో కనీసం ఇప్పుడున్న దాని మీద సగం కంటే ఎక్కువ ధర పలికినా గానీ గజం 40 వేలు అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 20 లక్షల పెట్టుబడి 53 లక్షలు అవుతుంది. అంటే 33 లక్షల లాభం. ఐదేళ్ళలో 33 లక్షలు అంటే ఏడాదికి 6 లక్షల 60 వేలు. అంటే నెలకు 55 వేలు. ఇదే 20 లక్షలను వడ్డీకి తిప్పితే 40 వేలు వస్తాయి. అదే స్థలం కొంటే నెలకు అదనంగా 15 వేలు వచ్చినట్టు అవుతుంది. పోనీ తక్కువలో తక్కువ నెలకు 50 వేలు వచ్చినా గానీ 10 వేలు మిగిలినట్టే కదా. పైగా వడ్డీ వ్యాపారం చేస్తే అసలు తిరిగి వస్తుందో లేదో అనేది గ్యారంటీ లేదు. అదే స్థలం మీద పెట్టుబడి పెడితే మాత్రం వడ్డీ వ్యాపారం చేసిన దాని కంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే ఎలాంటి స్థలం మీద పెట్టుబడి పెడుతున్నారనేది చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టే ముందు ఆ ఏరియాలో డిమాండ్ ఎలా ఉంది? ఫ్యూచర్ లో డిమాండ్ ఎలా ఉంటుంది? డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? అనేవి చూసుకోవాలి. 

Show comments