Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ ఘటన.. ఆచూకీ చెబితే రూ.10 లక్షలు : NIA

Rameshwaram Cafe, NIA: రామేశ్వరం కేఫ్ ఘటన.. ఆచూకీ చెబితే రూ.10 లక్షలు : NIA

ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. నగరంలోనే ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటన విషయంలో ఎన్ఐఏ అధికారులు కీలక విషయం వెల్లడించారు.

ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. నగరంలోనే ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్ లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటన విషయంలో ఎన్ఐఏ అధికారులు కీలక విషయం వెల్లడించారు.

సమాజంలో నిత్యం నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. అనేక పేలుడు ఘటనలు, ఇతర పెద్ద పెద్ద చోరీలు జరుగుతుంటాయి. అలానే పలు సందర్భాల్లో ఉగ్రదాడులు చోటుచేసుకుంటాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకు పోలీసులు, ఎన్ఐఏ అధికారులు చేధిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అనుమానితులను, నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో  అధికారులు రివార్డులు ప్రకటిస్తుంటారు. తాజాగా రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనకు సంబంధించి ఓ విషయంలో రూ.10 లక్షలు ఇస్తామని  ఎన్ఐఏ ప్రకటించింది. మరీ.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కర్నాటక రాష్ట్రంలోని బెంగుళురూ నగరంలో రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఈ కేఫ్ లో  పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచనం సృష్టించింది. పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని తేలడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. అయితే  రామేశ్వరం కేఫ్ ఘటనలో ఇప్పటికే ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా పథకం ప్రకారం పేలుడుకి పాల్పపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పేలుడు  ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అందులో ఓ వ్యక్తి టోపీ పెట్టుకొని మాస్క్, పఫ్లర్ ధరించి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి ఏదో ఆర్డర్ చేశాడనట్లు కనిపించింది. టిఫిన్ చేసిన తర్వాత బయటకు వెళ్లే ముందు బ్యాగ్ ని ఓ మూలకు పెట్టాడు. ఆ తరువాత కొద్ది సేపటికే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురుకి గాయాలు అయ్యాయి.

రామేశ్వరం కేఫ్  పేలు కేసులో అనుమానితుడిని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే అధికారులకు పూర్తి స్థాయిలో అతడి ఆచూకి సంబంధించి సమాచారం దొరకలేదు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి నేషనస్ ఇన్వేష్టిగేషన్ ఎజెన్సీ ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనలో సీసీటీవీలో కనిపించిన అనుమానితుడి ఆచూకి తెలిపిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్  ఏజెన్సీ ప్రకటించింది. సమాచారం తెలిపేందుకు 080-29510900,8904241100కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామాని ఎన్ఐఏ వెల్లడించింది.

కాగా రామేశ్వరం కేఫ్ లో లభించే ఫుడ్ ఐటమ్స్ కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. నిత్యం వేలాది మంది ఫుడ్ లవర్స్ ఈ కేఫ్ ను సందర్శిస్తుంటారు. కాగా రామేశ్వరం కేఫ్ లో లభించే ఫుడ్ ఐటమ్స్ కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. నిత్యం వేలాది మంది ఫుడ్ లవర్స్ ఈ కేఫ్ ను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ పేలుడుకు ప్లాన్ వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మరి… రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనకు సంబంధించి అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments