KKR Pacer Harshit Rana Suspended For One Match: సక్సెస్ జోష్​లో ఉన్న KKRకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్​పై బ్యాన్!

సక్సెస్ జోష్​లో ఉన్న KKRకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్​పై బ్యాన్!

ఢిల్లీ క్యాపిటల్స్ మీద సక్సెస్​తో జోష్​లో ఉంది కేకేఆర్. అయితే ఆ టీమ్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోల్​కతా జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ మీద బ్యాన్ వేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ మీద సక్సెస్​తో జోష్​లో ఉంది కేకేఆర్. అయితే ఆ టీమ్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోల్​కతా జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ మీద బ్యాన్ వేశారు.

ఐపీఎల్-2024లో కోల్​కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ సీజన్​ను స్టార్ట్ చేసిన అయ్యర్ సేన వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉంది. ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్​లో సెకండ్ ప్లేస్​లో ఉంది. తదుపరి ఆడే ఐదు మ్యాచుల్లో కనీసం రెండు విజయాలు సాధించినా ఆ టీమ్ ప్లేఆఫ్స్​ చేరుతుంది. ఇక, నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 7 వికెట్ల తేడాతో గెలిచింది. డీసీ సంధించిన 153 పరుగుల టార్గెట్​ను ఇంకో 21 బంతులు ఉండగానే ఛేజ్ చేసేసింది. అయితే నెగ్గిన ఆనందంలో ఉన్న ఆ టీమ్​కు భారీ షాక్ తగిలింది.

కేకేఆర్ యంగ్ పేసర్ హర్షిత్ రాణా మీద నిషేధం విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఐపీఎల్ కోడ్ ఆఫ్​ కండక్ట్​ను మీరినందుకు గానూ అతడికి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా వేశారు. అలాగే ఒక మ్యాచ్​ ఆడకుండా అతడిపై బ్యాన్ విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్​లోని లెవల్ 1 శిక్ష కింద నిషేధం విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతకముందు కూడా ఇదే లెవల్, ఆర్టికల్ కింద అతడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు హర్షిత్. దీంతో అప్పట్లో అతడి మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు.

ఢిల్లీ క్యాపిటల్స్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్​ను ఔట్ చేశాడు హర్షిత్. అయితే అలవాటు ప్రకారం ఇంకోసారి ఫ్లయింగ్ కిస్ ఇవ్వబోయాడు. దాదాపుగా చేతిని పెదాల దాకా తీసుకొచ్చి ఆపేశాడు. దీంతో అతడిపై మరోమారు చర్యలు తీసుకున్నారు. ఈసారి ఏకంగా ఓ మ్యాచ్​లో ఆడకుండా బ్యాన్ వేశారు. హర్షిత్ మీద నిషేధం వార్త తెలుసుకున్న నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కేకేఆర్ పేసర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడని, వికెట్లు కూడా తీస్తున్నాడని.. కానీ అతిగా సెలబ్రేట్ చేసుకుంటూ అనవసర వివాదాల్లో చిక్కుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్​గా బిల్డప్ ఇస్తే ఇలాగే ఉంటుందని, ఇక మీదైనా క్రమశిక్షణతో ఉంటూ తన ఆటేదో తాను ఆడుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి.. హర్షిత్ రాణాను బ్యాన్ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments