బాలయ్య మాస్ పాటకి.. దుమ్ములేపిన కాజల్-శ్రీలీల! వీడియో వైరల్..

బాలయ్య మాస్ పాటకి.. దుమ్ములేపిన కాజల్-శ్రీలీల! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 04:28 PM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Published - 04:28 PM, Tue - 20 June 23
బాలయ్య మాస్ పాటకి.. దుమ్ములేపిన కాజల్-శ్రీలీల! వీడియో వైరల్..

నందమూరి బాలకృష్ణ హీరోగా.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “భగవంత్ కేసరి”. తాజాగా బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ వదిలాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఊరమాస్ లుక్, ఫైట్స్ తో ఎప్పటిలాగే బాలయ్య దుమ్మురేపాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఇక షూటింగ్ లోకేషన్లో చేసే ఫన్ ను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాలో షేర్ చేస్తుంటారు అనిల్ రావిపూడి. మెున్న ఫైట్ మాస్టర్స్ తో కలిసి స్టెప్పులు వేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు.

భగవంత్ కేసరి.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం. మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రపోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక షూటింగ్ టైమ్ లో డైరెక్టర్ అనిల్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. లొకేషన్లో చేసిన రచ్చను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అయితే ఈసారి పోస్ట్ చేసిన వీడియో అయనది కాదు. హీరోయిన్ కాజల్-శ్రీలీలలు చేసిన ఊరమాస్ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశాడు దర్శకుడు. భగవంత్ కేసరి షూటింగ్ లో పాల్గొన్న కాజల్, శ్రీలీల బాలయ్య మాస్ పాటకు ఊరమాస్ స్టెప్పులు వేశారు.

ఈ క్రమంలోనే బాలయ్య నరసింహ నాయుడు సినిమాలోని చిలకపచ్చకోక పాటకు ఊరమాస్ స్టెప్పులు వేశారు కాజల్, శ్రీలీల. వీరిద్దరి గ్రేస్ చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే అంతలా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు ఇద్దరు. ప్రస్తుతం వీరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తర్వాత భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎలాగైనా దసరా పండక్కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి టీమ్ భావిస్తోందట. అందుకే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది భగవంత్ కేసరి.

Show comments