చావుబతుకుల మధ్య Jr. NTR అభిమాని! సాయం కోసం ఎదురుచూపులు!

చావుబతుకుల మధ్య Jr. NTR అభిమాని! సాయం కోసం ఎదురుచూపులు!

అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్ యాక్సిండెంట్ కు గురైయ్యాడు. దీనితో ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా.. తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్ యాక్సిండెంట్ కు గురైయ్యాడు. దీనితో ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా.. తారక్ అభిమానులు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం సమాజంలో మానవతా దృక్పథంతో ఆలోచించేవారు.. చాలా అరుదుగా ఉన్నారు. కళ్ళ ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతున్న ఈ రోజుల్లో.. ఎక్కడో కొంతమంది మాత్రమే ఇతరులకు వారి వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో.. ఎక్కడైన ఏదైనా అనుకోని సంఘటన చోటు చేసుకుంటే.. క్షణాల్లో ఆ వార్త అందరికి తెలిసిపోతుంది. ఇలా ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ.. ఆర్థిక స్థోమత సరిగా లేని వారి కోసం.. వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఫండ్స్ రైజ్ చేస్తూ.. ఇతరుల నుంచి ఎంతో కొంత సహాయాన్ని ఆసిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం. అయితే, తాజాగా ఆసుపత్రిలో ఉన్న ఓ ఎన్టీఆర్ అభిమాని కోసం.. సోషల్ మీడియాలో ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమానికి రోడ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో ఆ వ్యక్తికీ బాగా దెబ్బలు తగిలాయని డాక్టర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికీ మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. అయితే, ఆ వ్యక్తి కుటుంబం ఆర్ధికంగా వెనుకబడి ఉన్న కారణంగా.. ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులంతా కలిసి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. పేరుకు ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకుని కాలర్ ఎగరేయడం కాకుండా.. ఆయన పేరు చెబుతూ.. ఇలా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. సాటి మనిషి కష్టంలో ఉంటే మనకెందుకులే అని వదిలేయకుండా.. ఆ వార్తను సోషల్ మీడియా వరకు తీసుకుని వచ్చి.. అందరికి తెలిసేలా చేస్తూ.. ఎదో ఒక విధంగా ఆ వ్యక్తికీ సాయం అందేలా చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ వార్త తారక్ వరకు చేరేలా.. అతనికి సాయం అందాలని కోరుకుంటూ.. కొంతమంది అభిమానులు జూనియార్ ఎన్టీఆర్ ను కూడా ట్యాగ్ చేస్తున్నారు.

సాధారణంగా ఏ హీరో అభిమానులైనా సరే.. వారి ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ రోజున హడావిడి చేయడం. ఫ్యాన్ వార్స్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆ హీరో పేరిట అన్నదానాలు లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు సాటి తారక్ అభిమాని కష్టాల్లో ఉంటే.. దానికి స్పందించి.. మిగిలిన అభిమానులు.. సేవ దృక్పతంతో ఆలోచించి.. ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా ఆలోచించే వారు సమాజంలో చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మంచి పనులకు అందరు సహకరిస్తే.. సమాజంలో ఎంతో కొంత మార్పు అనేది వస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments