Jeff Bezos Paying Month Rent: లక్షల కోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లో ఉంటున్న జెఫ్ బెబోస్.. ఎందుకంటే..?

లక్షల కోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లో ఉంటున్న జెఫ్ బెబోస్.. ఎందుకంటే..?

  • Author singhj Published - 08:47 PM, Sat - 26 August 23
  • Author singhj Published - 08:47 PM, Sat - 26 August 23
లక్షల కోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లో ఉంటున్న జెఫ్ బెబోస్.. ఎందుకంటే..?

జెఫ్ బెజోస్.. ఈ పేరు తెలియనివారు ఉండరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతగా వ్యాపార రంగంపై ఆయన తన ముద్రను వేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బెజోస్ సంపద విలువ 157 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైనే. ఆయనకు ఉన్న ఆస్తితో ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద లగ్జరీ బిల్డింగ్​లు, కార్లు, విమానాలు.. ఇలా ఏది కావాలంటే అది క్షణాల్లో తెప్పించుకోవచ్చు. కానీ బెజోస్ మాత్రం ఇంత ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లో ఉంటున్నారట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

కాబోయే భార్య, గర్ల్​ఫ్రెండ్ లారెన్ సాంచెజ్​తో కలసి కాలిఫోర్నియాలోని మాలిబు మాన్షన్​లో జెఫ్ బెజోస్ నివాసం ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అద్దె భవనం మరెవరిదో కాదు.. హాలీవుడ్​కు చెందిన లెజెండరీ మ్యూజీషియన్ కెన్నీ జీకి చెందినదట. 5,500 చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఈ బిల్డింగ్​లో పెద్ద స్విమ్మింగ్ పూల్​తో పాటు రికార్డింగ్ స్టూడియో, విశాల సముదాయం, స్క్రీనింగ్ రూమ్, ఇతర ఫెసిలిటీస్ ఉన్నాయట. అలాగే 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గెస్ట్ హౌస్ కూడా ఉందట.

సముద్ర తీరాన ఉన్న అద్దె బిల్డింగ్​లో జెఫ్ బెజోస్ తన ప్రేయసితో కలసి ఈ సంవత్సరం మార్చి నుంచి నివాసం ఉంటున్నారని సమాచారం. ప్రస్తుతం బేవర్లీ హిల్స్​లో విశాల భవనాన్ని నిర్మించుకుంటున్నారు బెజోస్. అది పూర్తయ్యేందుకు మరికొంత టైమ్ పట్టనుండటంతో.. అప్పటి వరకు ఈ అద్దె ఇంట్లోనే సాంచెజ్​తో కలసి ఉండనున్నారట. ఈ ఇంటికి ఆయన ప్రతి నెలా సుమారు 6 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.5 కోట్లు) అద్దె చెల్లిస్తున్నారని సమాచారం. గర్ల్​ఫ్రెండ్ సాంచెజ్​తో పెళ్లి తర్వాతే కొత్త ఇంట్లోకి ఆయన మారనున్నారని వినికిడి.

Show comments