Patamsetti Suryachandra-Pawan Kalyan{ కార్యకర్తలెవరూ పవన్‌ కోసం త్యాగాలు చేయొద్దు: పాఠంశెట్టి సూర్యచంద్ర

కార్యకర్తలెవరూ పవన్‌ కోసం త్యాగాలు చేయొద్దు: పాఠంశెట్టి సూర్యచంద్ర

పార్టీని నమ్ముకుని.. ప్రజల్లో ఉంటూ కష్టపడిన వారికి జనసేనలో గుర్తింపు లేదని.. డబ్బులేకపోత రాజకీయాల్లోకి రావొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సూర్యచంద్ర. ఆ వివరాలు..

పార్టీని నమ్ముకుని.. ప్రజల్లో ఉంటూ కష్టపడిన వారికి జనసేనలో గుర్తింపు లేదని.. డబ్బులేకపోత రాజకీయాల్లోకి రావొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సూర్యచంద్ర. ఆ వివరాలు..

2019 ఎన్నికల తర్వాత.. పవన్‌ తిరిగి సినిమాల్లోకి వచ్చేశాడు. ఈ ఐదేళ్ల పాటు జనసేన పార్టీని కాపాడుకుంది కార్యకర్తలే. పవన్‌ పార్ట్‌ టైమ్‌ రాజకీయాలు చేస్తే.. కేడర్‌ మాత్రం అహోరాత్రలు పార్టీ కోసం పని చేసింది. గెలుపోటములతో సంబంధం లేకుండా కార్యకర్తలు పార్టీని అంటిపెట్టుకుని.. దాని అస్థిత్వాన్ని కాపాడుకున్నారు. పార్టీ కోసం, పవన్‌ కోసం జనసేన కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీ ప్రబావం చూపుతుందని భావించారు. అయితే ఎప్పుడైతే జనసేన.. టీడీపీతో పొత్తు పెట్టుకుందో.. అప్పుడే కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు మొదలయ్యాయి. సర్ది చెప్పాల్సిన పవనే టీడీపీకి మద్దతుగా మాట్లాడుతూ.. సొంత కార్యకర్తలకు వార్నింగ్‌లు ఇచ్చాడు. ఇక తాజాగా సీట్ల పంపిణీ వ్యవహారంలో వారికి తీరని అన్యాయం చేశాడు పవన్‌. పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకుని.. తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచాడు.

ఈ క్రమంలో జగ్గంపేట సీటును ఆశించి జనసేన నేత పాఠంశెట్టి సూర్యచంద్రకు హ్యాండిచ్చాడు పవన్‌. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీటును తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దాంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రోడ్డుపైనే బోరున విలపించాడు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తనకు పవన్‌ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక తనకు కాకుండా జగ్గంపేట సీటును టీడీపీకి కేటాయిండంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. జాబితా వెలువడిన రోజు అనగా శనివారం రాత్రి అంతా అచ్చుతాపురంలోని అమ్మవారి ఆలయంలో దీక్షకు దిగాడు సూర్యచంద్ర.

ఈ సందర్భంగా సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ..‘డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు అని మరోసారి నిరూపితం అయ్యింది. ఐదేళ్లు జనం మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాడాను. నాకు టికెట్‌ ఇస్తాను అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా టికెట్ రాలేదని చెప్తున్నారు. ఐదేళ్లు నన్ను తన స్వార్థం కోసం వాడుకుని ఇప్పుడు పక్కకు పెట్టారు. దీని వల్ల డబ్బుల్లేని వారెవరు రాజకీయాల్లోకి రాకుడదని మరోసారి నిరూపితం అయ్యింది. పేదలు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్నాను. నా మరణం రాజకీయ పార్టీలతో సహా అందరికీ కనువిప్పు కలగాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సూర్యచంద్ర భార్య శ్రీదేవి మాట్లాడుతూ.. ‘పొత్తు ధర్మం పేరు చెప్పి జనసేన పార్టీ మమ్మల్ని మోసం చేసింది. డబ్బు లేదని తెలిసి జనాల్లో తిరుగుతూ కష్టపడే నాయకుడిని ఈరోజు పట్టించుకోవడం లేదు. మాపై ఆధారపడిన జనసేన కార్యకర్తల పరిస్థితి ఏమిటి.. వారికి మేం ఏం సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు ఒకటే మనవి చేస్తున్నాను. మీరు ఎవరూ కుటుంబాల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి పార్టీ కోసం త్యాగాలు చేయకండి. నా భర్తకు అన్యాయం జరిగింది. ఐదేళ్లుగా మే ఇద్దరం జనం సమస్యలపై పోరాడుతున్నాము. అయినా పవన్ మమ్మల్ని పట్టించుకోకపోవడం దారుణం. జనసేన పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు. మా ప్రాణ త్యాగం అందరికీ గుణపాఠం కావాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Show comments