Jabardasth Shanti Emotional: ఆపరేషన్ కోసం ఇల్లు అమ్మేశా.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!

ఆపరేషన్ కోసం ఇల్లు అమ్మేశా.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!

Jabardasth Shanti Emotional: తెలుగు బుల్లితెరపై వచ్చే జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ లో లేడీ గెటప్ తో అందరి దృష్టి ఆకర్శించిన వారిలో శాంతి ఒకరు.

Jabardasth Shanti Emotional: తెలుగు బుల్లితెరపై వచ్చే జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ లో లేడీ గెటప్ తో అందరి దృష్టి ఆకర్శించిన వారిలో శాంతి ఒకరు.

ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్ వచ్చాయి. కానీ జబర్ధస్త్ కామెడీ షోకి వచ్చినంత క్రేజ్ దేనికీ రాలేదు. జబర్ధస్త్ తో ఎంతోమంది సక్సెస్ సాధించి ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. వేణు, షకలక శంకర్, సుడిగాలి సుధీర్, ధన్ రాజ్, గెటప్ శీను ఇలా ఎంతోమంది జబర్ధస్త్ తో అద్భుతమైన స్కిట్స్ ప్రదర్శించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ లో లేడీ గెటప్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్ అలియాస్ శాంతి.  ప్రేక్షకులు జబర్ధస్త్ శాంతి అని పిలుస్తుంటారు. తాజాగా శాంతి ఎమోషన్ అయ్యింది. ఇంతకీ జబర్ధస్త శాంతి ఎమోషన్ కి గల కారణాలు ఏంటో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఇష్టం. జబర్ధస్త్ లో తమ పంచ్ డైలాగ్స్, కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరింస్తుంటారు. ఒకప్పుడు జబర్ధస్త్ లో రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరించేవారు. వీరిద్దరూ వెళ్లిపోయిన తర్వాత ఎంతో మంది జడ్జీలుగా వ్యవహరించారు. ప్రస్తుతం కృష్ణ భగవాన్, ఖుష్బు వ్యవహరిస్తున్నారు. జబర్ధస్త్ లో లేడీ గెటప్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో ఒకరు శాంతి స్వరూప్. ప్రేక్షకులు జబర్ధస్త్ శాంతి అని పిలుస్తారు. తన కామెడీతో అందరినీ నవ్వించే జబర్ధస్త్ శాంతి.. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. గతంలో తన తల్లికి సర్జరీ చేయించడానికి తన ఇంటికి అమ్మేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.

జబర్ధస్త్ శాంతి తన తల్లి మోకాలి సర్జరీ విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఎమోషన్ అవుతూ.. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ విషయాన్ని పోస్ట్ చేసింది. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో మోకాలి సర్జరీ సక్సెస్ ఫుల్ గా ముగిసిందని.. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందికి తమను బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లి ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా చిన్నచిన్న పనులు సొంతంగా చేసుకోవడం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందని తెలిపింది.  ప్రస్తుతం మా అమ్మ ఎంతో ఆరోగ్యంతో ఉన్నారని శాంతి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏదీ ఉండదని ఎమోషన్ అయ్యింది.

Show comments