RCB vs GT Mohammed Siraj Is Back: గుజరాత్ బ్యాటర్లను వణికించిన సిరాజ్.. హైదరాబాదీ దెబ్బ చూపించాడు!

RCB vs GT: గుజరాత్ బ్యాటర్లను వణికించిన సిరాజ్.. హైదరాబాదీ దెబ్బ చూపించాడు!

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఐపీఎల్​లో అంతగా రాణించడం లేదు. బ్యాటర్లను భయపెట్టి ఆర్సీబీని గెలిపిస్తాడని అనుకుంటే.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. అలాంటోడు కరెక్ట్ టైమ్​లో ఫామ్​లోకి వచ్చాడు.

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఐపీఎల్​లో అంతగా రాణించడం లేదు. బ్యాటర్లను భయపెట్టి ఆర్సీబీని గెలిపిస్తాడని అనుకుంటే.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. అలాంటోడు కరెక్ట్ టైమ్​లో ఫామ్​లోకి వచ్చాడు.

మహ్మద్ సిరాజ్.. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక సభ్యుడిగా మారాడు. టీమ్​లో ప్లేస్ కష్టమనే స్థాయి నుంచి.. అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్​ రేంజ్​కు ఎదిగాడు. వన్డే వరల్డ్ కప్​-2023లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. ఈ హైదరాబాదీ పేసర్ ఐపీఎల్-2024లో అంతగా రాణించడం లేదు. బ్యాటర్లను భయపెట్టి ఆర్సీబీని గెలిపిస్తాడని అనుకుంటే.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. దీంతో కొన్ని మ్యాచుల్లో అతడ్ని బెంచ్ మీద కూర్చోబెట్టారు. అలాంటోడు కరెక్ట్ టైమ్​లో ఫామ్​లోకి వచ్చాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​ బ్యాటర్లతో ఓ రేంజ్​లో ఆడుకుంటున్నాడు సిరాజ్. పవర్​ప్లే బీస్ట్​గా తనను ఎందుకు పిలుస్తారో ఈ మ్యాచ్​తో అతడు ప్రూవ్ చేసుకున్నాడు. పవర్​ప్లేలో 2 ఓవర్లు వేసిన సిరాజ్ మియా కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. జీటీ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (1), శుబ్​మన్ గిల్ (2)ను అతడు వెనక్కి పంపాడు. సిరాజ్ పేస్​కు అపోజిషన్ బ్యాటర్లు వణికిపోయారు. ఈ హైదరాబాదీ బౌలింగ్​ చూసిన అభిమానులు.. కరెక్ట్ టైమ్​కు అతడు ఫామ్​లోకి వచ్చాడని అంటున్నారు. టీ20 ప్రపంచ కప్​కు ముందు తిరిగి లయను అందుకున్నాడని.. ఇంక భారత జట్టుకు తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సిరాజ్ బౌలింగ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments