MI vs SRH Tilak Varma Said Suryakumar Bluffed: సూర్య ఇంత మోసం చేస్తాడని ఊహించలేదు.. తిలక్ వర్మ కామెంట్స్!

MI vs SRH: సూర్య ఇంత మోసం చేస్తాడని ఊహించలేదు.. తిలక్ వర్మ కామెంట్స్!

వరుస ఓటములతో డీలాపడ్డ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్​గా తప్పుకుంది. అయితే నిన్న సన్​రైజర్స్ హైదరాబాద్​పై గెలుపుతో ఫ్యాన్స్​కు కాస్త ఊరట కలిగించింది.

వరుస ఓటములతో డీలాపడ్డ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్​గా తప్పుకుంది. అయితే నిన్న సన్​రైజర్స్ హైదరాబాద్​పై గెలుపుతో ఫ్యాన్స్​కు కాస్త ఊరట కలిగించింది.

వరుస ఓటములతో డీలాపడ్డ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్​గా తప్పుకుంది. అయితే నిన్న సన్​రైజర్స్ హైదరాబాద్​పై గెలుపుతో ఫ్యాన్స్​కు కాస్త ఊరట కలిగించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆరెంజ్ ఆర్మీ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48) టాప్ స్కోరర్. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన ముంబై.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను రీచ్ అయింది. సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్), తిలక్ వర్మ (37 నాటౌట్) ఎంఐ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ జోడీ నాలుగో వికెట్​కు 143 పరుగులు జోడించారు. అయితే మ్యాచ్ తర్వాత తిలక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సూర్యకుమార్ తనను మోసం చేశాడని తిలక్ అన్నాడు. మొదట్లో 3 వికెట్లు త్వరత్వరగా పడటంతో తాము మెళ్లిగా ఆడాలని అనుకున్నామని అన్నాడు. క్రమంగా జోరు పెంచాలని.. ఎక్కువగా స్ట్రెట్ బ్యాట్ షాట్స్ ఆడాలని డిసైడ్ అయ్యామని చెప్పాడు. అయితే మిస్టర్ 360 మోసం చేశాడని.. తాను ఎడాపెడా షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడని తెలిపాడు. అతడు బాగా ఆడుతుండటంతో తాను స్ట్రైక్ రొటేట్ చేసి అతడికి ఇచ్చానని పేర్కొన్నాడు. సూర్య సెంచరీ కొడతాడని ముందే గ్రహించానన్నాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుండటంతో తాను షాట్లు కొట్టనని చెప్పానని.. అందుకే సింగిల్స్​కే కట్టుబడ్డానని తిలక్ రివీల్ చేశాడు.

సరిగ్గా ఏ సమయంలో అటాకింగ్​కు దిగాలనేది తాము నిర్ణయించుకోలేదని.. కానీ స్ట్రైట్ బ్యాట్​తో ఆడాలని మాత్రం అనుకున్నామని తిలక్ వివరించాడు. అయితే ఉన్నట్లుండి మార్కో యాన్సెన్ బౌలింగ్​లో సూర్య హిట్టింగ్​కు దిగడంతో తాను షాకయ్యానని తెలిపాడు. స్ట్రైట్ బ్యాట్​తో ఆడదామని చెప్పి స్కై తనకు మోసం చేశాడని.. అతడు మంచి ఊపు మీద ఉండటంతో తాను కూడా అతడికి సపోర్ట్ చేశానని పేర్కొన్నాడు. ఇక, మార్కో యాన్సెన్ వేసిన 7వ ఓవర్​లో సూర్య ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత అతడు మరింత చెలరేగి చిన్నపాటి తుఫాన్ సృష్టించాడు. మొత్తానికి 51 బంతుల్లో 102 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. మరి.. సూర్య-తిలక్ జోడీ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments