MS Dhoni: ధోని ముసలోడే కదా.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

MS Dhoni: ధోని ముసలోడే కదా.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ముసలోడు అంటూ కామెంట్ చేశాడు. వీరూ భాయ్ అలా ఎందుకు కామెంట్ చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ముసలోడు అంటూ కామెంట్ చేశాడు. వీరూ భాయ్ అలా ఎందుకు కామెంట్ చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో ఆటగాళ్లపై సెటైర్లు వేయడంలో దిట్ట వీరూ భాయ్. మరీ ముఖ్యంగా పాక్ ప్లేయర్లపై కడుపుబ్బా నవ్వే సెటైర్లు వేస్తుంటాడు ఈ డాషింగ్ బ్యాటర్. తాజాగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సీఎస్కే ఫీల్డింగ్ ను ప్రశంసిస్తూనే వారిని ఓ ఆటాడుకున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మహేంద్రసింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించి చరిత్రకెక్కాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో తన కెప్టెన్సీ పదవిని వదులుకుని యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలు అప్పగించాడు. రుతురాజ్ ఆ పదవిని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. రెండు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించి.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటివలే గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఫీల్డింగ్ పై టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్ గా, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు వీరూ భాయ్.

ఈ మ్యాచ్ గురించి, సీఎస్కే ఫీల్డింగ్ గురించి వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ..”చెన్నై ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నారు. ఇక వయసు మీద పడ్డాకానీ(ముసలోడు) ధోని సైతం ఓ సూపర్ క్యాచ్ ను డైవ్ చేసి అందుకున్న తీరు అమోఘం” అని వీరూ చెప్పుకొచ్చాడు. అయితే పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ మాట్లాడుతూ..” రహనే విషయంలో ముసలోడు అనే పదం వాడలేదు ఎందుకు?” అని ప్రశ్నించాడు. దానికి వీరూ భాయ్ ఆన్సర్ ఇస్తూ..” వాళ్లిద్దరూ ఒకటి కాదు కదా? ధోని కంటే రహనే చిన్నోడు. పైగా ఫిట్ గా ఉన్నాడు. రహానేకి 35, ధోనికి 42.. వారి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు” అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి సెహ్వాగ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదికూడా చదవండి: SRH గెలిచినా MIదే అరుదైన రికార్డు.. హార్దిక్ సేనను మెచ్చుకోవాల్సిందే!

Show comments