IMD Forecasts 3 days rains: చల్లని కబురు.. రాష్ట్రంలో మూడ్రోజులు ఉరుములు- మెరుపులతో కూడిన వర్షాలు

చల్లని కబురు.. రాష్ట్రంలో మూడ్రోజులు ఉరుములు- మెరుపులతో కూడిన వర్షాలు

IMD Forecasts 3 days rains: మండే ఎండల్లో వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

IMD Forecasts 3 days rains: మండే ఎండల్లో వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భానుడు ప్రచండ కిరణాలకు అల్లాడిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే గరిష్టంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే మిగిలిన జిల్లాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సూర్యుడు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలు సూర్యూడి ప్రతాపానికి వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడిపోయో పరిస్థితి కనిపిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కంగారు పెడుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం మంగళవారం రోజు రాష్ట్రంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యవసరం అయితేనే బయటకు రండి అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు అందించారు. ఏప్రిల్ 19, 20, 21 రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 19, 20, 21 రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం మాత్రమే కాకుండా.. పలు జిల్లాల్లో వర్షం కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ 20కి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 20న వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏప్రిల్ 21వ తారీఖున ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో నమోదవుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలు కంగారు పెడుతున్నాయి. బయటకు రావాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండలకు బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పడంతో చల్లని కబురు చెప్పారంటూ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో చల్లని కబురు అందిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments