పది నిమిషాల్లో మద్యం డోర్ డెలివరీ.. మొదలుపెట్టిన హైదరాబాద్ సంస్థ..

పది నిమిషాల్లో మద్యం డోర్ డెలివరీ.. మొదలుపెట్టిన హైదరాబాద్ సంస్థ..

విదేశాల్లో చాలా వరకు మద్యం డోర్ డెలివరీ చేసే దేశాలు చాలానే ఉన్నాయి. ఇక మన దేశంలో కూడా ఢిల్లీ లాంటి కొన్ని నగరాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ ఇప్పటికే చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యం డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించి ప్రచారం చేస్తుంది.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న ఈ సంస్థ కోల్‌కతాలో తన లిక్కర్ డోర్ డెలివరీ మొదలుపెట్టింది. కోల్‌కతాలో ఉన్న పలు వైన్ షాపులతో బూజీ ఒప్పందం కుదుర్చుకుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ లాగే ఇది కూడా పని చేస్తుంది. దీని యాప్ లోకి వెళ్లి మనకి కావాల్సిన ఆల్కహాల్ ని ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది బూజీ. దీంతో కోల్‌కతాలో దీనికి మంచి రెస్పాండ్ వస్తుంది. ఇక్కడ బాగా క్లిక్ అయితే దేశంలోని పలు ముఖ్యనగరాల్లో కూడా మొదలుపెడతామని ఈ సంస్థ చెప్తుంది.

Show comments