Banjara Hills Crime News: తరుచుగా ఫోన్ వాడుతున్న కూతురు! తండ్రి వార్నింగ్ ఇవ్వడంతో..!

తరుచుగా ఫోన్ వాడుతున్న కూతురు! తండ్రి వార్నింగ్ ఇవ్వడంతో..!

నేటి కాలం యువతి, యువకులు ఎక్కువగా సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు. ఇక స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా చదువును పక్కనబెట్టి మొబైల్ తోనే టైమ్ పాస్ చేస్తున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ బాలిక తరుచుగా ఇంట్లో సెల్ ఫోన్ వాడుతూ కనిపించేది. దీంతో తండ్రి కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక తట్టుకోలేకపోయిన ఆ బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి కూతురు ఇలా చేయడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంతకు ఆ బాలిక ఏం చేసిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన సంజీబ్ అనే వ్యక్తి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని నూర్ నగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇతనికి 8వ తరగతి చదివే ఇషికా మండల్ (13) అనే కూతురు ఉంది. కాగా, ఈ బాలిక రోజూ చదువును పక్కనబెట్టి తరుచు ఫోన్ లోనే కాలక్షేపం చేస్తుండేది. దీంతో తండ్రి అనేకసార్లు మందలించారు. ఇటీవల కూడా కూతురు ఫోన్ చూస్తూ కనిపించడంతో తండ్రి సంజీబ్ మరోసారి కూతురిపై ఆగ్రహానికి గురయ్యాడు.

తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కాగా, ఎంతసేపైనా ఆ బాలిక ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు చాలా సార్లు పిలిచి చూశారు. అయినా స్పందించలేదు. ఇక తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇషికా మండల్ ఇంట్లో ఫ్యానుకు వేలాడుతూ శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన ఆమె తల్లిదండ్రులు షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Show comments