ఎన్నికల వేళ బయట పడుతున్న నోట్ల కట్టలు.. కోట్లు సీజ్!

ఎన్నికల వేళ బయట పడుతున్న నోట్ల కట్టలు.. కోట్లు సీజ్!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇక ఈ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి, అక్రమ సొమ్ము రవాణపై నిఘ పెట్టింది. తాజాగా ఓ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇక ఈ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి, అక్రమ సొమ్ము రవాణపై నిఘ పెట్టింది. తాజాగా ఓ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. మెనిఫెస్టోలు ప్రకటించి.. ప్రజలను ఆకర్షించే పనిలో ప్రధాన పార్టీల నేతలు పడ్డారు. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి, అక్రమ సొమ్ము రవాణపై నిఘ పెట్టింది. దేశ వ్యాప్తంగా అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న బస్సులో భారీగా నగదు పట్టుబడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలానే నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ అంత ముగిసింది. ఇక ఎన్నికల పొలింగ్ జరగడమే ఆలస్యం అన్నట్లు ఉంది. ఇదే సమయంలో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఊరు,వాడ, గల్లీగల్లీ తిరుగుతు ప్రజలను ప్రస్ననం చేసుకునే పనిలో పడ్డారు. ఇలా బయటకు కనిపించేది ఒకటైతే..మరోవైపు అడ్డదారిలో నోట్ల కట్టలు కూడా చేతులు మారుతుంటాయి. వేల కోట్ల డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ మార్గంల రవాణ అవుతుంటాయి. ఇలా ఎన్నికల వేళ… కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీలును విస్తృత్తం చేసింది. ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతున్నాయి. పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక చోట్ల భారీగా మద్యం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఇటీవలే కర్నాటక రాష్ట్రంలోని బళ్లారిలో, హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టుబడింది. తాజాగా ఏపీలో ఓ బస్సులో కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్‌ చేశారు.

గోపాలపురం నియోజగవర్గంలోని జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్ ను పోలీసులు తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న 2.40 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. బస్సులో తరలిస్తున్న నగదు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు  పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Show comments