యాషెస్ సిరీస్.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఔట్! వీడియో వైరల్..

యాషెస్ సిరీస్.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఔట్! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 12:23 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 12:23 PM, Sat - 17 June 23
యాషెస్ సిరీస్.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఔట్! వీడియో వైరల్..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్ని సిరీస్ లు టోర్నీలు ఉన్నాగానీ యాషెస్ సిరీస్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్ కోసం ఆ రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాక వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు కూడా ఎదురుచూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సిరీస్ తాజాగా ప్రారంభం అయ్యింది. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎప్పటిలాగే తమ బజ్ బాల్ క్రికెట్ ను ఆసిస్ కు రుచి చూపించారు. తొలి రోజే భారీ స్కోర్ చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఔట్ నమోదు అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

యాషెస్ సిరీస్.. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ కోసం ప్రపంచం మెుత్తం ఎదురుచూస్తుంటుంది. అంతలా ఈ సిరీస్ కు ప్రాచూర్యం ఉంది. తాజాగా శుక్రవారం (జూన్ 16) నుంచి ఈ సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలి రోజే ఆసిస్ టీమ్ కు తమ బజ్ బాల్ క్రికెట్ సత్తా చూపించారు బ్రిటీష్ బ్యాటర్లు. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 393 పరుగులకు చేసి డిక్లేర్ ప్రకటించింది. జట్టులో స్టార్ బ్యాటర్ జో రూట్ (118) సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లలో ఓపెనర్ క్రావ్లే(61), బెయిర్ స్టో (71) అర్ద శతకాలతో మెరిశారు. ఆసిస్ బౌలర్లలో నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టును దెబ్బతీశాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన ఔట్ నమోదు అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చేస్తుండగా.. లియాన్ బౌలింగ్ కు వచ్చాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ లో రెండో బంతిని బ్రూక్ డిఫెన్స్ ఆడగా.. బాల్ అతడి కాలుకు తాకి గాల్లోకి లేచింది. దాంతో బాల్ ఎటు వెళ్లిందో అని ఆసిస్ కీపర్ కేరీ పైకి చూశాడు. అంతలోనే బాల్ కింద పడి వికెట్లను గిరాటేసింది. దాంతో ఆశ్చర్యపోయాడు బ్రూక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పాపం బ్రూక్ అంత దురదృష్టవంతుడు ఎవడూ లేడు అనుకుంటా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరేమో ఇలాంటి ఔట్ క్రికెట్ చరిత్రలోనే అరుదు అని రాసుకొచ్చారు. కాగ బజ్ బాల్ క్రికెట్ తో గతంలో పాకిస్థాన్ ను, న్యూజిలాండ్ ను మట్టి కరిపించిన ఇంగ్లాండ్ అదే స్ట్రాటజీని ఆసిస్ పై కూడా ప్రయోగించింది. మరి ఈ బజ్ బాల్ ప్రయోగం ఎంత వరకు సఫలం అవుతుందో వేచి చూడాలి.

Show comments