ముంబై డగౌట్‌లోని ఈ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు పెద్ద తోపు!

ముంబై డగౌట్‌లోని ఈ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు పెద్ద తోపు!

Mumbai Indians, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ నాలుగో ఓటమిని చవిచూసింది. అయితే.. మ్యాచ్‌ ఫలితం అటుంచితే.. ముంబై డగౌట్‌ పాత ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అందులో ఉంది ఎవరో చెప్పుకోండి చూద్దాం..

Mumbai Indians, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ నాలుగో ఓటమిని చవిచూసింది. అయితే.. మ్యాచ్‌ ఫలితం అటుంచితే.. ముంబై డగౌట్‌ పాత ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అందులో ఉంది ఎవరో చెప్పుకోండి చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌కి మళ్లీ ఓటమి ఎదురైంది. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. హ్యాట్రిక్‌ ఓటములు మూటగట్టుకుంది. ఆ తర్వాత రెండు వరుస విజయాలతో ట్రాక్‌ ఎక్కినట్లు కనిపించిన ముంబై.. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ సమయంలో చివరి ఓవర్‌ వేయడపై పాండ్యా చేసిన తప్పైపోయింది. అయితే.. మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. సోషల్‌ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్‌ అవుతుంది. అది ముంబై ఇండియన్స్‌ డగౌట్‌కు సంబంధించిన ఫొటో.

సీఎస్‌కే వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌ తర్వాత ఆ పొటో మరింత వైరల్‌ అయింది. ఆ ఫొటోలో ఉన్న ఓ కుర్రాడు ఎవరా? అంటూ చాలా మంది ఆరా తీస్తున్నారు. రింకీ పాంటింగ్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ కోచ్‌గా కాకుండా ఓ ఆటగాడిగా.. ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో ఉన్న సమయంలో తీసిన ఫొటో అది. ఆ ఫొటో తీసిన సమయంలో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. క్రీజ్‌లో రోహిత్‌ శర్మ 30 బంతుల్లో 50, కీరన్‌ పొలార్డ్‌ 17 బంతుల్లో 45 పరుగులు చేసి ఆడుతున్నారు. అప్పుడు కూడా ముంబై ఇండియన్స్‌ సీఎస్‌కే తోనే మ్యాచ్‌ ఆడుతోంది. రోహిత్‌ శర్మ, పొలార్డ్‌ కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో జరిగిన మ్యాచ్‌ అది. ఆ మ్యాచ్‌ సందర్భంగా ఓ కుర్రాడు ముంబై డగౌట్‌లో నిల్చోని రోహిత్‌, పొలార్డ్‌ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా. 2013లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. ఐపీఎల్‌ నుంచే టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం ఆ టీమ్‌కు కెప్టెన్‌ అయ్యాడు. అయితే.. ఐపీఎల్‌ 2022 సీజన్‌కి ముందు కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు మారిన పాండ్యా.. తొలి సీజన్‌లోనే ఆ టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. తర్వాతి సీజన్‌లో రన్నరప్‌గా నిలిపాడు. దీంతో పాండ్యా కెప్టెన్సీపై నమ్మకం పెట్టుకున్న ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌.. అతన్ని తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి రప్పించి.. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. కానీ, ప్రస్తుతం బ్యాడ్‌ ఫామ్‌తో పాండ్యా విమర్శల పాలవుతున్నాడు. మరి ఒకప్పుడు ముంబై డగౌట్‌లో అనామకుడిలా ఉన్న పాండ్యా ఈ రోజు ముంబై కెప్టెన్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments