అబ్బాయి అమ్మాయిగా మారే కన్ఫ్యూజింగ్ కామెడీ మూవీ.. ఒకేసారి రెండు OTTల్లోకి..

Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కన్ఫ్యూజింగ్ కామెడీ మూవీ.. ఒకేసారి రెండు OTTల్లోకి..

ఓటీటీ లోకి కొత్త కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అయితే కొత్త సినిమాలంటే థియేటర్ లో రిలీజ్ అయిన బడా హీరోల సినిమాలు కాదు.. కేవలం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అనుతున్నాయి, ఇక ఇప్పుడు తాజగా మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

ఓటీటీ లోకి కొత్త కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అయితే కొత్త సినిమాలంటే థియేటర్ లో రిలీజ్ అయిన బడా హీరోల సినిమాలు కాదు.. కేవలం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అనుతున్నాయి, ఇక ఇప్పుడు తాజగా మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

సినిమా అంటే కేవలం థియేటర్ లోనే చూడాలి అనుకునే రోజులు కనుమరుగైపోయాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తున్నాయి, కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో రిలీజ్ అయితే.. మరికొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆయా సినిమాలు ఎలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ.. కథ బావుంటే మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో హన్సిక నటించిన ఓ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, అనే విషయాలను చూసేద్దాం.

ఆ సినిమా పేరు పార్ట్నర్. ఈ సినిమాకు మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో ఆదిపినిశెట్టి, హ‌న్సిక‌ హీరో హీరోయిన్లుగా నటించగా.. వారితో పాటు యోగిబాబు, ప‌ల‌క్ ల‌ల్వానీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మొదట థియేటర్ లో విడుదల చేసినపుడు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలనీ అనుకున్నారు మేకర్స్. కానీ, కొన్ని కారణాల వలన తెలుగు వెర్షన్ ను థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లోను, అమెజాన్ ప్రైమ్ లోను ఈ సినిమా తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. క్రమంగా తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక పార్ట్నర్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఆది వ్యాపారంలో బాగా నష్టపోయి.. అప్పుల బారిన పడతాడు. దీనితో ఆ అప్పులను తీర్చడానికి సిటీ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ రన్ చేసే తన స్నేహితుడు దగ్గరకు వస్తాడు. పెద్ద మొత్తంలో అతనికి డబ్బు అవసరం అవుతుంది. దానికోసం ఓ సైంటిస్ట్ తయారు చేసిన చిప్ ను దొంగలించి దానిని వేరే వ్యక్తికీ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ చిప్ దొంగిలించే క్రమంలో.. ఆ సైంటిస్ట్ చేసిన ప్రయోగం కారణంగా తన ఫ్రెండ్ అమ్మాయిగా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ! వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ! తిరిగి అతను అబ్బాయిల మారాడా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments